అతడిపై రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెంట్స్: హీరో ఫొటో గోడ మీద.. అది మాత్రం బెడ్ మీద అంటూ!

0
11

తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తూ.. రెండు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతోంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన అభినయం.. అదిరిపోయే హోస్టింగ్‌తో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢీ షోలో పాల్గొన్న ఆమె.. పర్సనల్ విషయాలను లీక్ చేసింది. ఇందులో భాగంగానే చైతన్యపై యాంకర్ రష్మీ గౌతమ్ హాట్ కామెంట్స్ చేసింది.

అలా మొదలైన ప్రయాణం… ఇలా ఫేమస్

దాదాపు పదేళ్ల క్రితమే రష్మీ గౌతమ్ టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో రష్మీ గౌతమ్ యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని తక్కువ టైమ్‌లోనే ఎక్కువ గుర్తింపును అందుకుంది.

సినిమాల్లోనూ సత్తా… గ్లామరస్ పాత్రలతో

కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ మారింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో లీడ్ రోల్ చేసింది. వాటిలో ఎక్కువ శాతం గ్లామరస్ రోల్స్ ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘గుంటూరు టాకీస్’తో మాత్రమే విజయాన్ని అందుకుంది. మిగిలినవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

అతడితో ప్రేమాయణం.. మరింత పాపులర్

యాంకర్‌గా రష్మీ గౌతమ్ చేసింది కేవలం జబర్ధస్త్ షో మాత్రమే. ఈ ఒక్క దానికే తెలుగు రాష్ట్రాల్లో ఆమె పాపులర్ అయిపోయిందనుకుంటే పొరపాటే. ఈ షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లే ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోందామె. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

అందులోనూ జంటగా రెచ్చిపోతున్నారుగా

చాలా కాలంగా జబర్ధస్త్‌లో షోలో సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జంటకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ సినిమాల్లోనూ సోలోగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక, అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ’ షోలోనూ ఈ జోడీ తెగ హల్‌చల్ చేస్తోంది. మెంటర్లుగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తూ అప్పుడప్పుడూ మజాను పంచుతున్నారు.

ప్రముఖ షోలో రష్మీ గౌతమ్ హాట్ కామెంట్స్

వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఢీ 13.. కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లు కలిసి డ్యాన్స్ చేయనున్నారు. ఎంతో సందడిగా సాగిన ఈ ప్రోమోలో మెంటర్లు అందరూ కలిసి చేసిన కామెడీ కూడా అలరించింది. మరీ ముఖ్యంగా చివర్లో రష్మీ గౌతమ్.. కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్‌పై రొమాంటిక్ కామెంట్స్ చేసింది.

హీరో ఫొటో గోడ మీద.. అది మాత్రం బెడ్‌ మీద

వచ్చే వారం ఎపిసోడ్‌లో చైతన్య మాస్టర్ చిన్న పిల్లాడిలా మారి డ్యాన్స్ చేశాడు. దీనికి అక్కడున్న వాళ్లంతా తెగ ఎంజాయ్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్‌పై రష్మీ మాట్లాడుతూ.. ‘హీరోలు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నా వాళ్ల ఫొటోలు మాత్రం గోడపై ఉంటాయి. కానీ, టెడ్డీ‌బేర్ ఎప్పుడూ బెడ్ మీదే ఉంటది’ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. దీంతో చైతన్య మాస్టర్ తెగ సిగ్గు పడిపోయాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here