spot_img
Homeఆంధ్రప్రదేశ్వంశీని పక్కన పెట్టేశారా?

వంశీని పక్కన పెట్టేశారా?

వల్లభనేని వంశీ. ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న నాయకుడు. టీడీపీ తరఫున ఆయన విజయం దక్కించుకుని.. అదేటీడీపీ పంచన రాజకీయంగా ఎదిగారు. ఈ విషయా న్ని ఆయన కూడా ఒప్పుకుంటారు. అయితే.. గత ఎన్నికల్లో జగన్ సునామీ తట్టుకుని మరీ విజయం దక్కించుకున్న ఈయువ నాయకుడు అనూహ్యంగా వైసీపీ పై ప్రేమ కురిపించారు. కారణాలు ఏవైనా.. ఆయన వైసీపీకి మద్దుతు ప్రకటించడంతోపాటు. అదేసమయంలో చంద్రబాబును ఆయన వారసుడు లోకేష్‌ను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు.

అయితే.. వ్రతం చెడ్డా.. ఫలితం దక్కలేదన్న సామెత.. వంశీ విషయంలో స్పష్టంగా కనిపిస్తోందని అంటు న్నారు పరిశీలకులు. ఎలాగంటే.. గన్నవరంలోని వైసీపీ నాయకులు వంశీ రాకను జీర్ణించుకోలేక పోతు న్నారు. వీరంతా ఆది నుంచి కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ  వెంకట్రావు నేతృ త్వంలో వంశీకి వ్యతిరేకంగా.. గళం వినిపిస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడ వంశీకి వ్యతిరేకంగా.. సభలు సమావేశాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు ఆయన దూకుడుకు అడ్డుకట్టవేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అసలు ఇక్కడ కొత్త ఇంచార్జ్‌ను నియమించాలంటూ.. పార్టీకి వర్తమానం పంపారు.  ఎక్కడ ఏఅవకాశం వచ్చినా.. వంశీ కి వ్యతిరేకంగా.. నాయకులు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాయకులు.. గట్టి సందేశం పంపించాలని… అధిష్టానం తమ మాట వినేలా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రేపు వంశీకే ఈ టికెట్ ఇస్తే.. తాము ఎట్టి పరిస్థితిలోనూ.. సహకరించేది లేదని.. స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే గన్నవరం వైసీపీకి కొత్త ఇంచార్జ్‌ను నియమించాలనే డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. అంతేకాదు.. “ఇది మా ఇంట్లో పండుగ. మమ్మల్ని మాత్రమే నిర్వహించుకోనివ్వండి. బయటి వారి జోక్యం అవసరం లేదు` అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.  వాస్తవానికి బుధవారం నుంచి వైసీపీ అధిష్టానం..గడప.. గడపకు.. వైసీపీ కార్యక్రమం ప్రారంబించనుంది. ఈ క్రమంలో ప్రజలను కలిసి.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో గన్నవరం పార్టీ నాయకులు.. మాత్రం `చలో తాడేపల్లి“ కార్యక్రమానికి పిలుపునివ్వడం.. ముఖ్యంగా వంశీ వ్యతిరేకులు అందరూ.. కూడగట్టుకుని.. దీనిలో పార్టిసిపేట్ చేయడం.. సంచలనంగా మారింది.  అంతేకాదు.. గన్నవరం నుంచి బైక్‌లతో ర్యాలీగా వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌కు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం.. ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.  దీనిని బట్టి.. గన్నవరం వైసీపీ నాయకులు.. వంశీని పక్కన పెట్టేశారా? అనే సందేహాలువ్యక్తమవుతున్నాయి.

admin
adminhttps://maanayakudu.com
165.25.64.610 maanayakudu.com TML.619

- Advertisement -

spot_img

Worldwide News, Local News in London, Tips & Tricks

spot_img

- Advertisement -