శ్రీదేవి రెండో కూతురితో సైక్లింగ్ చేస్తున్న ఆ కుర్రాడెవరు?

0
73

మహారాష్ట్ర ముంబైలలో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇంట్లోనే ఉన్నారు. కానీ ఓ ఇద్దరు స్టార్ కిడ్స్ మాత్రం రోడ్లపై సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ఆ ఇద్దరూ చెలాకీగా సైకిల్ తొక్కుతూ సరదాగా ముచ్చట్లాడుకుంటూ చూపరుల మనసు దోచారు.

ముంబై వీధుల్లో కనిపించిన ఆ అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఈ సీన్ లో ఉన్న స్టార్ కిడ్స్ ఎవరు? అంటే.. శ్రీదేవి నటవారసురాలు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ .. సైఫ్ అలీఖాన్ కుమారుడు సారాకు సోదరుడు అయిన ఇబ్రహీం అలీ ఖాన్ .. జంట అలా సైకిల్ పై కలిసి షికార్ వెళుతూ కెమెరా కంటికి చిక్కారు.

ఇంకాస్త వివరాల్లోకి వెళితే.. ఖుషి .. ఇబ్రహీం నగరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో కనిపించారు. ఇంట్లో ఉండటానికి అలసటను అధిగమించడానికి ఖుషీ తన స్నేహితుడితో కలిసి సైక్లింగ్ సెషన్ కు వెళ్లారట. వీరిద్దరూ శివారు ప్రాంతాల్లో కనిపించారు. ఖుషీ సైక్లింగ్ చేస్తున్నప్పుడు వైట్ ట్యాంక్ టాప్.. పింక్ మాస్క్ ట్రాక్ ప్యాంట్ ధరించి కనిపించింది. ఇబ్రహీం విషయానికొస్తే.. నీలిరంగు షార్ట్స్ టీస్.. స్పోర్ట్స్ షూస్ తో జెర్సీ ధరించి కనిపించాడు.

ఇబ్రహీం.. ఖుషీ కూడా బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించనున్నారు. వారి తల్లిదండ్రులు.. సైఫ్ అలీ ఖాన్ – బోనీ కపూర్ వారి తెరంగేట్రంపై ఇదివరకూ ఆసక్తిని కనబరిచారు. మరి కొన్ని సంవత్సరాలలో వారు అరంగేట్రం చేయనున్నట్లు ధృవీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here