#Valimai Motion Poster : రచ్చ రేపిన అజిత్.. నెవర్ బిఫోర్ అంతే!

0
8

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎక్కువే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అజిత్ గురించి. ఆయన చాలా ఏళ్లుగా హవా చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. తలా అజిత్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆయనకు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. అలాంటి ఆయన చేస్తున్న సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ రచ్చ చేశారు. దీంతో ఈరోజు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మళ్ళీ హిట్ కాంబో

హిట్, ఫాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న తలా అజిత్ చివరి సినిమా ముందు వరకు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరిగా ‘నెర్కొండ పార్వాయి’తో భారీ హిట్‌ను సొంతం చేసుకున్న అజిత్ మళ్ళీ ఆ సినిమా హిట్ ఇచ్చిన దర్శకుడు హెచ్ వినోథ్‌తో ‘వాలిమై’ అనే సినిమా చేస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2019 లో ప్రారంభమైంది. కరోనా కర్ఫ్యూ చిత్రం షూటింగ్ నిలిపివేయబడింది, తర్వాత చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది.

ట్రేండింగ్ లోకి తెచ్చి మరీ

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి నటిస్తున్నారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ లేదని అంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గోల గోల చేస్తున్నారు. వీరు గోల పడలేక ఒక మోషన్ పోస్టర్ విడుదల చేయబడుతుందని ప్రకటించారు. ఈ దెబ్బతో అజిత్ అభిమానులు #వాలిమైమోషన్ పోస్టర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ లోకి వచ్చేసి మరీ సంబరాలు చేసుకున్నారు.


సంబరాల్లో ఫాన్స్

వాలిమై మోషన్ పోస్టర్ 2 సంవత్సరాల తరువాత విడుదల కావడంతో అజిత్ అభిమానులు సంబరాల్లో ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆనందపరిచింది. ఈ చిత్ర నిర్మాత బోనీ కపూర్ తన ట్విట్టర్ పేజీలో యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేశారు. అంతకుముందు, ఈ సినిమా పేరు విడుదలైన తర్వాత ఫస్ట్ లుక్ మరియు ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయకపోవడంతో అజిత్ అభిమానులు నిరాశ చెందారు. దీంతో ఈనెల 15న ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలనుకున్నారు.

మామూలు రచ్చ కాదుగా

కానీ ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేసేందుకు మధ్యాహ్నమే ఈ మోషన్ పోస్టర్ ని సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక రిలీజ్ అయిన ఈ మోషన్ పోస్టర్ లో అజిత్ వేరే గెట్ అప్ లో ఉన్నాడు. మోషన్ పోస్టర్ కోసం యువన్ యొక్క నేపథ్య సంగీతం కూడా భిన్నంగా ఉంటుంది. ఇంగ్లీష్ లో ‘పవర్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్’ అనే పదం మాత్రమే కనిపిస్తుంది. ఈ మోషన్ పోస్టర్‌లో చాలావరకు బైక్ రేస్ సన్నివేశాలు కనిపిస్తాయి. పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయని మాత్రమే మనం ఊహించవచ్చు.

తెలుగు కుర్ర హీరో విలన్ గా

ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘వాలిమై’ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. సినిమాలో అజిత్ కుమార్ బైక్ రేసర్‌గా నటిస్తుండగా బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. కాలా సినిమాలో నటించిన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.తెలుగు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here