Sarpatta Parambarai ‘వేటపులి’ మనకి బాగా తెలిసిన నటి భర్తే.. ఎవరో తెలుసా?

0
20

పా. రంజిత్ దర్శకత్వం వహించిన సర్పట్టా వంశ సినిమా సుదీర్ఘ వెయిటింగ్ అనంతరం థియేట్రికల్ విడుదలను స్కిప్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు అంతే పేరు తెచ్చుకున్నది ఎవరైనా ఉన్నారా ? అంటే అది వేటపులి అనే క్యారెక్టర్ చేసిన జాన్ కొక్కెన్. ఆయన మనకు బాగా తెలిసిన ఒక నటి భర్త. ఆ వివరాల్లోకి వెళితే

రీ ఎంట్రీ

ఈ చిత్రంలో, వెంబులి(వేటపులి) పాత్రలో నటించిన జాన్ కొక్కెన్ శివ దర్శకత్వం వహించిన మరియు అజిత్ నటించిన వీరం చిత్రంతో తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న ఆయన మళ్ళీ ఇప్పుడు సర్పట్టా పరంపర సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

అజిత్ అప్పుడే చెప్పారు

ఈ సందర్భంలో ఆయన సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. తాను వీరం చిత్రంలో అజిత్‌తో కలిసి నటించినప్పుడు, ‘మీ కోసం సమయం వస్తుంది, అప్పటి వరకు వేచి ఉండండి’ అని అజిత్ చెప్పాడని ఆయన అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా విడుదల తరువాత అందరి ప్రశంసలతో తడిసి ముద్ద అవుతున్నానని చెప్పుకొచ్చారు.

అజిత్ ఫోన్ చేశారు

ఇక ఈ సినిమా విడుదలైన రోజే అజిత్ నుంచి ఫోన్ వచ్చిందన్న ఆయన. ‘మీ సినిమా గురించి, క్యారెక్టర్ గురించి విన్నాను, నేను చెప్పినట్లుగా, మీ కోసం సమయం వచ్చింది’అని అజిత్ ఫోన్ ద్వారా అభినందించారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నేను వెంటనే నా భార్యకు ఫోన్ చేసి ఈ సంతోషకరమైన సంఘటనను పంచుకున్నానని జాన్ వెల్లడించారు.

ఆమె ఎవరో కాదు

ఇంతకీ ఆయన భార్య ఎవరా ? అనుకుంటున్నారా ? మనకు బాగా తెలిసిన అమ్మాయే. ఆమె మరెవరో కాదు పూజా రామ చంద్రన్.తెలుగులో ఎన్నో సినిమాల్లో కనిపించిన ఆమె ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వచ్చి బాగా పరిచయం అయింది. నటి పూజా రామచంద్రన్ ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో విజేగా పనిచేయడం ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలోనే ఆమె తన సహోద్యోగి విజయ్ ని వివాహం చేసుకున్నారు.

ఇద్దరికీ రెండో పెళ్ళే

ఆ తర్వాత అతనితో విడిపోయిన పూజా పూజా కొన్నేళ్ళ క్రితం తెలుగు నటుడు జాన్ కొక్కెన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. జాన్ కొకైన్ మొదట నటి మీరా వాసుదేవన్‌ను వివాహం చేసుకున్నాడు. తర్వాత అతను ఆవిడకు విడాకులు ఇచ్చి పూజతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా సర్పట్టా సినిమా హిట్ అయిన క్రమంలో ఆమె తన భర్తను అభినందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here