PSPKRana చిత్రానికి టైటిల్ ఇదేనా..?

0
11

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రిటైర్ట్ హవల్దార్ పాత్రలో రానా కనిపించనున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఇక్కడ మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ని యాడ్ చేసి.. ఆ పాత్రని ఇంకాస్త పవర్ ఫుల్ గా చూపిస్తున్నారని టాక్. అలానే సినిమా నిడివి కూడా తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనేది సినీ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

#PSPKRana చిత్రానికి ‘బిల్లా రంగ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ చిత్ర బృందం ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఏకే’ రీమేక్ లు తెలుగులో ”పరశురామ కృష్ణమూర్తి” అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. కాగా సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతో పాటుగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారని తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో #PSPKRana చిత్రాన్ని జూలై 11న తిరిగి ప్రారంభించి.. ఆగస్టు నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here