‘#NTR30’ దర్శకనిర్మాతలతో యంగ్ టైగర్..!

0
49

ఆర్.ఆర్.ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి కథాంశంతో ‘#NTR30’ రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఉగాది పండుగను పురస్కరించుకుని కొరటాల శివ మరియు నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఇద్దరూ తారక్ ని కలిసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ఇంతకముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది అప్పటికి తారక్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘#NTRkoratalaShiva2’ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కలుస్తున్నారు. జూన్ ద్వితీయార్థంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 2022 ఏప్రిల్ 29న పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమా గురించి కొరటాల ట్వీట్ చేస్తూ.. ‘‘తారక్ తో మరోసారి కలిసి సినిమా చేస్తుండడం సంతోషంగా ఉంది. గతంలో రిపేర్లు లోకల్ గానే చేశా. ఈసారి కొంచెం మార్పుతో సరిహద్దులుదాటబోతున్నాం’’ అని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here