Narappa Official Trailer: తొలిసారి వెంకటేష్ ఉగ్రరూపం.. నారప్ప ట్రైలర్పై ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్

0
7

జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా, వేగంగా సినిమాలు చేసే వారిలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘నారప్ప’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్ చాలా కాలం తర్వాత ఉగ్రరూపం చూపించారు. దీంతో ఆయన అభిమానులు షాక్ అవుతూ ట్వీట్లు చేస్తున్నారు.

ధనూష్ సినిమాకు రీమేక్‌గా నారప్ప

విక్టరీ వెంకటేష్.. శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తున్న చిత్రమే ‘నారప్ప’. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’కు ఇది రీమేక్‌గా వస్తోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెట్, వీ క్రియేషన్స్‌ పతాకాలపై డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.

ఓటీటీలో నారప్ప.. రిలీజ్ డేట్ ప్రకటన

ఇప్పటికే ‘నారప్ప’ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. దీన్ని విడుదల చేయాలనుకున్న సమయంలో కరోనా రెండో దశ వచ్చింది. దీంతో అది కాస్తా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యాక్షన్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. జూలై 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.

నారప్ప ట్రైలర్ రిలీజ్.. వెంకీ ఉగ్రరూపం

విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఆద్యంతం పవర్‌ఫుల్‌గా సాగిన ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో వెంకీ ఉగ్రరూపం చూపించారు. ప్రత్యర్థులను అడ్డంగా నరికేస్తూ ఎంతో వైలెంట్‌గా కనిపించారు. రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన ఆయన అదరగొట్టేశారు.

ట్రైలర్‌లో హైలైట్లు ఇవే.. ప్రియమణితో

తాజాగా విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్‌లో ప్రేక్షకులను అలరించే ఎన్నో హైలైట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ‘మన దగ్గర భూమి ఉంటే తీసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవరూ తీసుకోలేరు చిన్నప్ప’ అని వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే, మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసింది. ఇక, ప్రియమణి కూడా ఎంతో పవర్‌ఫుల్ లేడీగా కనిపించి మెప్పించింది.

‘నారప్ప’ ట్రైలర్‌పై ఫ్యాన్స్ రియాక్షన్

తమిళంలో ‘అసురన్’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ‘నారప్ప’ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ అందరూ ఆశించారు. కానీ, ఓటీటీలో తీసుకు రాబోతుంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో వాళ్లంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్లతో షాకింగ్‌ రియాక్షన్ ఇస్తున్నారు.

దింపేశారు అంటూ మరికొన్ని ట్వీట్లు

ఇక, ‘నారప్ప’ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. ‘అసురన్’ను ఉన్నది ఉన్నట్లుగా దించేశాడని అంటున్నారు. ఈ క్రమంలోనే తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం వెంకటేష్ కోసం ఈ సినిమా చూస్తామని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆయన మాస్ యాక్టింగ్‌ను కొనియాడుతున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here