3AM నిదుర లేచి మిడ్ నైట్ వరకూ బన్ని కష్టాలు!

0
16

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ నేచుర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆన్ లొకేషన్ డ్యాన్సులు యాక్షన్ నటన కోసం ఎంతగా కష్టపడతాడో ..  సెట్స్ కి వెళ్లిన తర్వాత సీన్ పూర్తయ్యేవరకూ ఎంత ఇన్వల్వ్ మెంట్ చూపిస్తాడన్నది డైరెక్టర్లు చెబుతుంటారు. బన్నీలో ఉన్న ఈ గొప్ప లక్షణాలన్నే అతడిని పెద్ద స్టార్ ని చేశాయి. అతడితో కలిసి పనిచేసిన డైరెక్టర్లు.. కోస్టార్లు బన్నీలో కమిట్ మెంట్ గురించి ఎంత గొప్పగా చెబుతారో తెలిసిందే.

ప్రస్తుతం బన్ని విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ తో `పుష్ప ` సినిమా చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రమిది. ఇందులో పుష్ప రాజ్ అనే డేంజరస్  స్మగ్లర్ గా బన్నీ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పుష్ప రాజ్ పోస్టర్లు మాస్ లోకి దూసుకెళ్లాయి. కాకులు దూరని కారడవిలో మెజారిటీ షూటింగ్ చేస్తున్నారు. క్యారెక్టరైజేషన్ లో లైవ్ లీ నెస్ కోసం బన్నీ ఎంతగా శ్రమించాడో ఇప్పటికే రిలీజైన పోస్టర్లు చూస్తేనే తెలుస్తోంది.

తాజాగా బన్నీ శ్రమని మరోసారి అతని ఫాల్కాన్ (కార్వాన్) డ్రైవర్ లక్ష్మణ్  కళ్లకు కట్టాడు. బన్నీ షూటింగ్ కోసం ఎంతగా శ్రమిస్తున్నాడో వివరించాడు. `డీప్ ఫారెస్ట్ లో షూటింగ్ చేసాం. ఫాల్కాన్ కొంత దూర మాత్రమే ప్రయాణించగలదు. అక్కడ నుంచి స్పాట్ కి చేరుకోవడానికి మరో మార్గం వెదుక్కోవాల్సిందే. షూటింగ్ స్పాట్ కు చేరుకోవాలంటే గంటన్నర పాటు బైక్ పై ప్రయాణం చేయాలి. బన్నీ షూటింగ్ జరిగినంత కాలం బైక్ మీద వెళ్లేవాడు. తెల్లవారు ఝామున మూడు గంటలకు లేచి తన పనులన్నీ పూర్తిచేసుకుని స్పాట్ చేరుకునేవాడు. అర్ధరాత్రి వరకూ షూటింగ్ చేసినా తర్వాత విశ్రాంతి లేకుండా మళ్లీ 3 గంటలకు లేచి వెళ్లిపోయేవాడు. అప్పుడే అర్ధమైంది బన్నీ కమింట్ మెంట్ డెడికేషన్ గురించి అని లక్ష్మణ్ తెలిపాడు. ప్రస్తుతం బన్నీ కి కరోనా పాజిటివ్ వచ్చిన  నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here