2022 సంక్రాంతి రిలీజ్ డేట్స్: ఒకేసారి 5 సినిమాలు..పవన్, ప్రభాస్, మహేష్ మధ్యలో ఆ రెండు వస్తే..రిస్క్ చేసినట్లే!

0
12

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రిలీజ్ డేట్స్ పై పోరాటాలు మొదలయ్యాయి. ఎవరికి వారు ముందు వెనక చూసుకోకుండా రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో తెలియదు గాని పెద్ద సినిమాలు వస్తే మాత్రం మీడియం బడ్జెట్ సినిమాలు పోటీ పడటం రిస్క్ తో కూడుకున్న పని. ఇక 2022 సంక్రాంతి ఫైట్ కు ఆల్ మోస్ట్ కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఆ పోటీలో మరో ముగ్గురు హీరోలు రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ నుంచి తప్పుకోవచ్చని కూడా టాక్ వస్తోంది.

పోటీలో మొత్తం 5 సినిమాలు

సంక్రాంతి అనగానే పెద్ద సినిమాల హడావిడి గట్టిగానే ఉంటుంది. అలాగే చిన్న సినిమాల కంటెంట్ బావుంటే కూడా జనాలు ఎగబడి చూస్తారు. ప్రస్తుతం అందరి చూపు కూడా 2022 సంక్రాంతిపై పడింది. ఇక ఈ పోటీలో మొత్తం 5 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక సినిమా డేట్ ఫిక్స్ కాగా మిగతా సినిమాల డేట్స్ చర్చల దశలో ఉన్నాయి.

రాధేశ్యామ్ డేట్ ఫిక్స్

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జనవరి 14న రాబోతున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే ఈ ఏడాది ఆగస్ట్ లేదా అక్టోబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రిస్క్ చేయడం ఇష్టం లేక సేఫ్ జోన్ లో సంక్రాంతి బరిలో దించుతున్నారు.

మహేష్ vs పవన్ కళ్యాణ్

ఇక పవన్ కళ్యాణ్ – రానా నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ జనవరి 10న రానుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 12 రావచ్చని టాక్ అయితే వస్తోంది. ఏ సినిమా వచ్చినా రాకపోయినా ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ యుద్ధం అయితే ముందే ఫిక్స్ అయ్యింది.

పోటీకి సిద్దమైన F3 – బీస్ట్

ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల మధ్య పోటీ అంటే ఎవరు కూడా రిస్క్ చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ F3తో వెంకటేష్ – వరుణ్ తేజ్ పోటీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోలీవుడ్ హీరో విజయ్ బీస్ట్ కూడా తెలుగులో భారీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

F3కి మళ్ళీ అలాంటి లక్కు వస్తుందా?

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన F2 సినిమా 2019లో సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే నిజానికి అప్పుడు పెద్ద సినిమాలు ప్లాప్ అయ్యాయి. వినయ విధేయ రామ – కథానాయకుడు – పేట సినిమాలు నెగిటివ్ టాక్ ను అందుకోవడంతో F2కు బాగా కలిసొచ్చింది. ఇక ఇప్పుడు F3కి అలాంటి అదృష్టం మళ్ళీ కలిసొస్తుందో లేదో చూడాలి.
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here