16 ఏళ్ల వయసులో మనోహరి కుటుంబాన్ని పోషించిందట

0
19

టీనేజీలో హైస్కూల్ చదువుకునేప్పుడు ఒక ఆడపిల్ల కుటుంబాన్ని పోషించాల్సిన కష్టం వస్తే.. ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తే.. ఆ కష్టం ఎలా ఉంటుందో ఊహించగలరా? కానీ అలాంటివన్నీ ఫేస్ చేశానని చెబుతోంది బాహుబలి మనోహరి నోరా ఫతేహి.

బాలీవుడ్ లో నటిగా కొనసాగుతున్న నోరా.. ఐటెమ్ గాళ్ గా .. రియాలిటీ షోల జడ్జిగానూ రాణిస్తోంది. మోడల్ గా ఆర్జిస్తోంది. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా సత్తా చాటుతోంది. ఇటు సౌత్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాల్లో ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోవర్స్ ని పెంచుకుని వాణిజ్య ప్రకటనల ద్వారా బాగానే ఆర్జిస్తోంది. అంతమాత్రాన తన గత జీవితం కేక్ వాక్ అయితే కాదు.

తనకు బోలెడన్ని కష్టాలున్నాయి. పదహారేళ్ల వయసులో నా కుటుంబంలో చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయని నోరా తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ..16ఏజ్ లోనే హైస్కూల్లో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.

పరిశ్రమలో బెస్ట్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన తరువాత నోరా ఫతేహి పాపులారిటీ అమాంతం పెరిగింది. ప్రొఫెషనల్ డాన్సర్ గా తన సోషల్ మీడియా ల్లో భారీగా అభిమానులను సంపాదించింది. 2018 లో యూట్యూబ్ లో ఒక బిలియన్ వ్యూస్ ను దాటిన హిట్ మ్యూజిక్ వీడియోలైన `దిల్ బర్`లో ఆమె కనిపించింది. ప్రతిసారీ నోరా తన ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలను వెతుక్కుంది. కొన్ని సంవత్సరాలుగా నోరా బాలీవుడ్ లో నటిస్తోంది. భారత్- స్త్రీ- బట్లా హౌస్- రోర్- సత్యమేవ జయతే సహా అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఏదేమైనా వెలుగులోకి రావడానికి ముందు ఆమె అనేక ఇతర ఉద్యోగాలు చేసింది.

16 వయస్సులో కోమల్ నహ్తా చాట్ షో `స్టార్రి నైట్స్ జనరల్ వై`లో కనిపించింది. నోరా తన మొదటి ఉద్యోగం తన హైస్కూల్ సమీపంలో ఉన్న ఒక మాల్ లో రిటైల్ సేల్స్ అసోసియేట్ గా పనిచేసానని చెప్పారు. ఆర్థిక సమస్యల వల్ల చిన్న వయస్సులోనే కుటుంబాన్ని పోషించడానికి రకరకాల ఉద్యోగాలు చేయాల్సొచ్చింది.. అని తెలిపారు. “రెస్టారెంట్లు.. బార్ లు షావర్మా ప్రదేశాలలో వెయిట్రెస్ గా పని చేశానని.. పురుషుల బట్టల దుకాణంలో కూడా పనిచేశానని నోరా చెప్పారు. “నేను ఒక టెలిమార్కెటింగ్ కార్యాలయంలో పనిచేశాను. ప్రజలను కోల్డ్ చేసి లాటరీ టికెట్లను అమ్మేదానిని“ అని నోరా చెప్పారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అభిషేక్ దుదయ్య తదుపరి చిత్రం `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో నోరా కనిపించనుంది. వార్ డ్రామాలో అజయ్ దేవ్ గన్- సోనాక్షి సిన్హా- సంజయ్ దత్ తదితరులతో కలిసి నటించారు. ఈ చిత్రం గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ -19 పరిమితుల కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. ఈ చిత్రం 2021 ఆగస్టు 15 న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here