హీరో నితిన్ డేట్ ఫిక్స్.. హైదరాబాద్‌లోనే ఏర్పాట్లు.. ఆహ్వానితుల జాబితా ఇదే!

0
19

ఎట్టకేలకూ టాలీవుడ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఎప్పడో పూర్తి కావాల్సిన పెళ్లి కరోనావైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా నితిన్ కుటుంబ సభ్యులు, పెళ్లికూతురు షాలిని ఫ్యామిలీ పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకు నితిన్ షాలిని వివాహం ఎప్పుడంటే..

దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తే
టాలీవుడ్ నితిన్, షాలిని వివాహాన్ని డిస్టినేషన్ వెడ్డింగ్ దుబాయ్‌లో ఏర్పాట్లు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 15వ తేదీన వివాహం, ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు. డిస్టినేషన్ వెడ్డింగ్‌కు దాదాపు 100 మంది గెస్టులను ఆహ్వానించారు. అయితే అనూహ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, పలు దేశాల్లో కఠిన నిబంధనలు విధించడంతో నితిన్ పెళ్లి ఏర్పాట్లు రద్దు చేశారు. ఆ తర్వాత సానుకూల పరిస్థితుల కోసం ఎదురుచూశారు.

హైదరాబాద్‌ నగర శివారులో
అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కరోనావైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరగడంతో పెళ్లి హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి ప్లాన్ చేశారు. జూలై 26వ తేదీ రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్‌లో కుటుంబ కార్యక్రమంగా వివాహాన్ని జరిపించనున్నారు. ఇప్పటికే నిఖితా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకొన్నట్టు సమాచారం.

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా
ఇక నితిన్, షాలిని పెళ్లికి పరిమితమైన గెస్టులను ఆహ్వానించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకొంటున్నారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించి కొద్ది మంది సన్నిహితులను నితిన్ ఆహ్వానించినట్టు తెలిసింది. నితిన్ స్వయంగా పవన్ కల్యాణ్, తివిక్రమ్‌తోపాటు పలువురు ప్రముఖులను స్వయంగా ఆహ్వానించినట్టు తెలిసింది.

కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత
పెద్ద ఎత్తున, సమూహంగా కాకుండా వ్యక్తిగతంగా హాజరై వధూవరులను దీవించే విధంగా కుటుంబ సభ్యుల ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత సినీ, రాజకీయ, వ్యాపార, అభిమాన వర్గాలకు భారీగా విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సన్నిహితులు తెలిపారు. అలాగే కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కూడా ఈ వివాహానికి దూరంగా ఉండాలని కోరినట్టు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here