హిందీ భాషపై కుర్రబ్యూటీ డెడికేషన్.. మాములుగా లేదుగా!

0
17

సినీ ఇండస్ట్రీలో కుర్రబ్యూటీ రష్మిక మందన క్రేజ్ మాములుగా లేదు. ఓవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తాచాటుతూనే రష్మిక.. మరోవైపు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. రెండేళ్ల కిందటే ఛలో సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రది ప్రస్తుతం స్టార్డంతో వేగంగా దూసుకెళ్తుంది. ఖాతాలో వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఇప్పటివరకు క్యూట్ బబ్లీ క్యారెక్టర్స్ పోషించిన రష్మిక.. త్వరలో పుష్ప సినిమాతో ఓ ఛాలెంజింగ్ పాత్రలో అలరించనుంది. టాలీవుడ్ స్టార్ కాంబినేషన్ అల్లు అర్జున్ – సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీగా పుష్ప తెరకెక్కుతుంది.

ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా అదే యాస మాట్లాడుతూ కనిపించనుంది. అయితే పుష్ప మూవీ షూటింగ్ దశలో ఉండగానే బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా అమ్మడు లైనులో పెట్టేసింది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రధానపాత్రలో.. డెబ్యూ డైరెక్టర్ శాంతను బాగ్చి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో రష్మిక బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇదివరకే విడుదల చేసిన మిషన్ మజ్ను మూవీ పోస్టర్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ రోని స్క్రూవాలా నిర్మాతగా నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మిషన్ మజ్ను సినిమా గురించి అమ్మడు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.

ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ లేనందున అమ్మడు ఇంటిపట్టునే ఉంటూ హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటుందట. అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి లాంగ్వేజ్ పరంగా పర్ఫెక్ట్ అవ్వాలని.. అలాగే ఇకపై ఫ్యూచర్ ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా ట్యూటర్ ను పెట్టుకొని మరీ హిందీ పై పట్టు సాధిస్తుందని సమాచారం. రష్మికకు ప్రస్తుతం వచ్చిన హిందీని కాస్తా ఈ ఖాళీ టైంలో స్కిల్స్ డెవలప్ చేసుకుంటోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ.

నిజానికి రష్మిక బాలీవుడ్ ఎంట్రీ అనేసరికి అభిమానులలో ఎక్సపెక్టషన్స్ కూడా పెరిగాయి. ‘ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ ఇండియస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్’ అనే ట్యాగ్ లైన్ తో ఆసక్తి రేకేత్తించారు మేకర్స్. అయితే పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ రహస్య గూఢచార సంస్థ(RAW) జరిపిన భారీ ఆపరేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. త్వరలోనే ఈ సినిమాతో పాటు అమితాబ్ తో గుడ్ బై అనే సినిమా కూడా చేస్తోంది. మొత్తానికి అమ్మడు మంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here