హాలీవుడ్ ఎంట్రీ పై మనసులోని మాట బయటపెట్టిన ఎన్టీఆర్..!

0
29

భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మన మూవీస్ గురించి నటీనటుల గురించి హాలీవుడ్ లో మాట్లాడుకునే స్థాయికి ఇండియన్ సినిమా ఎదిగింది. మన స్టార్స్ కూడా అవకాశం వచ్చినప్పుడు హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి హీరో ధనుష్ ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం హాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కోరికను వెలిబుచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివ – ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. వీటితో తారక్ మార్కెట్ ని నేషనల్ వైడ్ విస్తరించనుంది. కోవిడ్ సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఎన్టీఆర్.. ఓ అంతర్జాతీయ ఆన్ లైన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హాలీవుడ్ లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ”అక్కడ అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు.. నేను కూడా అంతే” అని తారక్ తన మనసులోని మాట బయటపెట్టారు. ఇప్పుడు భారతీయ సినిమా సరిహద్దులు దాటింది కాబట్టి ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ ను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో చూడొచ్చన్నమాట.

అలానే ‘పాన్ ఇండియా’ సినిమా గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. ‘పాన్ ఇండియా అనే పదం అంటే తనకు నచ్చదని.. ఒక మంచి సినిమాను దేశంలో ఉన్న అనేక భాషల్లో చూపించడమే తమ ఉద్దేశమని.. పాన్ అనే పదం వింటే వంట పాత్ర గుర్తుకొస్తుంద’ని అన్నారు. దర్శకత్వం చేయడం గురించి చెబుతూ.. ఇప్పటి వరకూ సినిమా డైరెక్ట్ చేయడం గురించి ఆలోచించలేదని.. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్ ని సృష్టించాలనే ఆలోచన మాత్రం ఉందని తారక్ చెప్పుకొచ్చారు. విధిని బలంగా నమ్ముతానని.. తాను నటుడిగా కథలో భాగం కావాలని కోరుకునే వ్యక్తినని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here