హార్డ్ వర్క్ లో బన్నీని మరో సచిన్ తో పోల్చాడు

0
18

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్.. డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు ఎంచుకునే మాస్ యాక్షన్ స్క్రిప్టులు కానీ క్లాస్ ఫ్యామిలీ సినిమాలు కానీ అతడి ఇమేజ్ ని పెంచుతున్నాయి అంటే వాటి కోసం కమిట్ మెంట్ తో అనుక్షణం వందశాతం హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టే. నటన డ్యాన్సుల పరంగా అతడి కమిట్ మెంట్ డెడికేషన్ పర్ఫెక్షన్ ప్రతిదీ ప్రతిసారీ చర్చకు వచ్చాయి. మెగా మేనల్లుడిగా అతడికి మెగాస్టార్ లోని హార్డ్ వర్కింగ్ నేచుర్ అబ్బింది. దాంతో పాటే ఒదిగి ఉండే స్వభావం ప్రయోగాత్మకత తనలో ఉన్నాయి.

తనను దగ్గరగా చూసిన నటుడు మధునందన్ తాజాగా బన్నీని సచిన్ టెండూల్కర్ తో పోల్చారు. మైదానంలో ఉన్నప్పుడు సచిన్ ఎంత  డెడికేటెడ్ గా ఆడతారో బన్ని కూడా సెట్లో అలానే ఉంటారు. బన్ని చాలా కష్టపడి పనిచేసే నటుడు. సచిన్ టెండూల్కర్ ను గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు. బన్నీ సచిన్ తో సమానం. క్రికెట్ లో సచిన్ ని ఎలా చూస్తామో .. కష్టపడి పనిచేసే బన్నీ కూడా అలానే కనిపిస్తాడు. అతడి నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. వాస్తవానికి.. అతను ఒక నటుడు ఎలా ఉండాలో దానికి మంచి ఉదాహరణ. అతడు ఒక స్ఫూర్తి అని కూడా అన్నారు.

బన్ని ప్రస్తుతం పుష్ప చిత్రీకరణలో ఉన్నారు. ఇటీవలే కోవిడ్ సోకడంతో స్వీయనిర్భంధంలో చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. ఇంతకుముందే అతడు క్షేమంగా ఉన్నారన్న విషయాన్ని వీడియో రూపంలో శిరీష్ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గాకే ఈ సినిమా పెండింగ్ షూట్ ని పూర్తి చేయనున్నారు. వేణు శ్రీరామ్ తో ఐకన్ పై చర్చలు సాగించే అవకాశం ఉంది. అలాగే కొరటాలతోనూ బన్ని ఓ సినిమా చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here