‘హాట్’గా ఉన్నావని కామెంట్ చేసిన వ్యక్తికి నటి హేమ షాకింగ్ రిప్లై..!

0
22

తెలుగు ప్రేక్షకులకు నటి హేమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ హిందీ భాషల్లో గత ముప్పై ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హేమ.. బిగ్ బాస్ తెలుగు సీజన్-3 లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇక రాజకీయాలపై ఆసక్తితో ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరిన హేమ.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోంది. ఇదంతా పక్కన పెడితే హేమ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన ఫాలోవర్స్ తో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు హేమ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన హేమ.. ప్రతి రోజు ఉదయాన్నే కెబిఆర్ పార్క్ కి వాకింగ్ వస్తానని.. ఈరోజు ఇక్కడ చింత చెట్లు ప్లీజ్ రా అంటూ తనను టెంప్ట్ చేస్తున్నాయని.. అందుకే తన కూతురితో కలిసి చింతచిగురు కోస్తున్నట్లు తెలిపింది. ఈ లైవ్ సెషన్ లోనే ఓ నెటిజన్ హేమను హాట్ అని సంభోదిస్తూ కామెంట్ పెట్టగా దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. ”ఇప్పుడు హాట్ ఏంట్రా నాయనా.. నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా.. బాబ్బాబు అంటే ఎవరైనా చిల్లర వేస్తారు.. అలాంటిది నీకు హాట్ గా కనిపిస్తున్నానా” అంటూ నవ్వుతూ హేమ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా నవంబర్ లో తన బర్త్ డే ముందు రోజు కరోనా సోకిందని తెలిపింది. అలానే కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ వ్యాక్సినేషన్ దొరికితే వేయించుకోవాలని సూచించారు హేమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here