హత్యకు కాంట్రాక్ట్ కిల్లర్ కు సుఫారీ ఇచ్చిన వర్మ

0
19

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. ఈ భూమి మీద ఎంతో మంది విభిన్నమైన వ్యక్తులు ఉంటారు. వారందరిలోకి కూడా వర్మ విభిన్నమైన వ్యక్తి. బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా తన జీవితం ఏంటో తాను బతికేస్తు తనకు నచ్చిన విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి వర్మ. ఈయన తన చావును కూడా తానే డిజైన్ చేసుకున్నాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ తన చావు కూడా తన చేతిలోనే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. తన కూతురికి ఇప్పటికే నేను చనిపోయిన సమయంలో రావద్దని చెప్పాను.. నా కోసం ఏడ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పానన్నాడు.

వర్మ ఇంకా మాట్లాడుతూ.. నేను అనారోగ్యంతో బాధపడుతూ నా పనులు నేను చేసుకోలేక వేరే వారిపై ఆదారపడ్డ రోజున నన్ను చంపేయాల్సిందిగా ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కు సుఫారీ ఇచ్చాను. అతడు నేను అనారోగ్యంతో మంచాన పడ్డ రోజున చంపేస్తాడు అంటూ చావు కబురు చల్లగా అన్నట్లుగా సింపుల్ గా చెప్పేశాడు. వర్మ తరహా ఈ ఆలోచన చాలా విభిన్నంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది ఆత్మహత్య సదృశ్యం అంటున్నారు. వర్మ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడా అంటూ ప్రశ్నిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ త్వరలో డీ కంపెనీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. థియేటర్లలో విడుదల చేయాలనుకున్న ఆసినిమాను కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు. వర్మ తన సొంత ఓటీటీని మొదలు పెట్టాడు. అందులో మొదటి సినిమాగా ఈనెల 15వ తారీకున డీ కంపెనీ రాబోతుంది. ఇంకా పలు సినిమాలు కూడా వర్మ ఆ ఓటీటీ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట. స్పార్క్ పేరుతో ఇప్పటికే ఓటీటీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here