`స్వాతంత్య్ర వీర్ సావర్కర్` బయోపిక్ ప్రకటన

0
23

బయోపిక్ ల ట్రెండ్ ఎండ్ లెస్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) 138 వ జయంతి సందర్భంగా చిత్ర నిర్మాత సందీప్ సింగ్ ఆయన జీవితంపై బయోపిక్ ప్రకటించారు. `స్వాతంత్య్ర వీర్ సావర్కర్` టైటిల్ ని వెల్లడించారు. నటుడు మహేష్ మంజ్రేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేసిన సావర్కర్ పై బయోపిక్ గురించి మంజ్రేకర్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ జీవితం ఆయన కాలం ఎంతో ఆకర్షిస్తోంది. చరిత్రలో ఆయన అరుదైన వీరుడు అని నేను నమ్ముతున్నాను. బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తూ.. చాలా మందిని ప్రభావితం చేసిన జీవితం అతడిది. దర్శకుడిగా నాకు ఇది ఒక సవాల్ అని తెలుసు. కానీ ఛాలెంజ్ ని తీసుకుంటున్నాను.. అని వ్యాఖ్యానించారు.

లెజెండ్ గ్లోబల్ స్టూడియో అధినేత సందీప్ సింగ్ మాట్లాడుతూ ..“వీర్ సావర్కర్ గొప్ప గౌరవం అందుకున్న వీరుడు. ఆయన గురించి నేటితరం ప్రజలకు సరిగా తెలియదు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన కీలక వ్యక్తి. అతని జీవిత ప్రయాణంలో ఒక పరిశీలనను ప్రదర్శించడమే మా ప్రయత్నం“ అని అన్నారు.

ఈ చిత్రం లండన్- అండమాన్ – మహారాష్ట్ర అంతటా తెరకెక్కుతుంది.
వి డి సావర్కర్ 138 వ జయంతి సందర్భంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ట్విట్టర్ లో నివాళులర్పించారు.

సావర్కర్ 1883 లో మహారాష్ట్రలో జన్మించాడు. హిందూత్వ సాంస్కృతిక జాతీయవాదం భారత రాజకీయాల్లో కీలక దశను తీసుకున్నప్పటి నుండి ఆయన బహిరంగ ప్రసంగాలతో పాపులరయ్యారు. సందీప్ సింగ్ ఇంతకుముందు ఇంతకుముందు మేరీకోమ్ – అలీఘర్.. సరబ్ జీత్.. భూమి.. పీఎం నరేంద్ర మోదీ వంటి బ్లాక్ బస్టర్లను నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here