స్వలింగసంపర్కురాలిని కానన్న హాట్ హీరోయిన్

0
18

బాలీవుడ్ లో జూనియర్ కత్రినగా పాపులరైన జరీన్ ఖాన్ వెండి తెరపై  సంచలనాల కోసం ప్రయత్నించడం ఇటీవల హాట్ టాపిక్ గా మారుతోంది. విలక్షణ పాత్రలతో ఈ భామ ఆశ్చర్యపరుస్తోంది. తెరను అమాంతం హీటెక్కించే ఎంపికలతో జరీన్ డేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరో సంచలనానికి రెడీ అవుతోంది. తన తదుపరి చిత్రంలో లెస్పియన్ గా నటించేందుకు జరీన్ ఖాన్ రెడీ అవుతోంది. ఆ పాత్రకు సంబంధించిన కొన్ని విషయాల్ని జరీన్ తాజాగా రివీల్ చేసింది.

ఒక నటిగా ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్దంగా ఉండాలి. ప్రస్తుతం అదే నేను చేస్తున్నాను. స్వలింగ సంపర్కరాలి పాత్రలో నటించడానికి తనలో ఎలాంటి భయాలు..ఆందోళనలు లేవని తెలిపింది. ఆడిషన్ కి వెళ్లినప్పుడు కొంచెం టెన్షన్ ఫీలయ్యాను. కానీ ఆడిషన్ తర్వాత క్రూ అంతా చాలా సంతృప్తి పడ్డారు. నా ట్యాలెంట్ ని గుర్తించి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. వాళ్ల నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతానని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి పాత్రలు చేయడం అంత అషా మాషీ కాదు. నా జీవితంలో చాలా భాగం మగరాయుడిలాగే బ్రతికాను. ఇప్పుడు లెస్బియన్ గా నటించడానికి నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టామ్ బాయ్ లా ఉన్నా స్త్రీ లక్షణాలున్న అమ్మాయిలా నటించాలి కాబట్టి ఆ లక్షణాల్ని అలవరుచుకోవాలని జరీన్ ఖాన్ తెలిపింది.  తాను హోమో సెక్స్ వల్ కానని.. ఇలాంటి పాత్రలో నటిస్తే ఎల్జీబీటీ కమ్యూనిటీ ఆగ్రహం చెందొచ్చని తెలిపింది. సల్మాన్  హీరోగా నటించిన వీర్ సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హౌస్ ఫుల్- హేట్ స్టోరి-3 లాంటి రొమాంటిక్   చిత్రాల్లో నటించి మెప్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here