స్టార్ హీరోయిన్ బాలీవుడ్ ఆశలు..!

0
29

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. సౌత్ ప్రేక్షకులు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. 2019 వరకు వరుస సినిమాలతో హవా నడిపించిన అమ్మడు కింగ్ నాగ్ తో మన్మధుడు సీక్వెల్ ప్లాప్ అయ్యేసరికి బాగా నెమ్మదించింది. గతేడాది లాక్డౌన్ సమయంలో ముంబైలో మూడు నెలలపాటు ఒకేచోట ఉండిపోయింది రకుల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఫ్యామిలీలతో కలిసి హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ సమయాన్ని గడుపుతున్నారు.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు తమిళం వరకే ఆగిపోకుండా బాలీవుడ్ వైపు కూడా దృష్టి పెడుతుంది. త్వరలోనే అమ్మడు మరో బాలీవుడ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ‘సర్దార్ కా గాడ్సన్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీలో అర్జున్ కపూర్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తుంది. నిజానికి మేకర్స్ ఈ సినిమా షూటింగ్ యూరప్ లో ప్లాన్ చేశారట. కానీ కరోనా మహమ్మారి వణికిస్తుండటంతో ఆ షెడ్యూల్ కాన్సల్ చేసి మిగిలిన షూటింగ్ ముంబైలోనే ఫినిష్ చేశారట.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైతే రకుల్ గుర్గావ్ నుండి మళ్లీ ముంబైకి రావాల్సి వెళ్లిందట. తప్పదు కదా మరి! ఈ సినిమాకు కాశ్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మడు ప్రస్తుతం బిజీగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటుంది. ఓ వైపు తమిళంలో రెండు సినిమాలు ఇండియన్-2 అయలన్ చేస్తూనే ఇటు బాలీవుడ్ పై ఫోకస్ పెడుతోంది. అయితే అమ్మడు ఇంకా ఫామ్ తెచ్చుకునేందుకు ‘సర్దార్ కా గాడ్సన్’ మూవీ పై భారీ ఆశలు పెట్టుకుందని సమాచారం. ఎందుకంటే తెలుగులో తమిళంలో హిట్స్ అందుకుంది. కానీ బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనే అమ్మడి ఆశ. అందుకే ప్రస్తుతం సర్దార్ పై ఆశలు పెట్టుకున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి రకుల్ అదృష్టం ఎలా ఉందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here