స్టార్ హీరోపై గరికపాటి షాకింగ్ కామెంట్స్.. అతను ఏం చేసినా ఇష్టమే.. రాబోయే సినిమా కూడా అదే!

0
14

ఆధ్యాత్మిక ప్రవచకులు గరికపాటి నరసింహారావు అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు అవధాని ప్రవచుకులు అంటే పెద్దవారికి మాత్రమే ఎక్కువగా తెలిసేది. కానీ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన అనంతరం యువతో కూడా గరికపాటి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. నేటి తరానికి అర్థమయ్యేలా ఆయన చెప్పే ప్రవచనాలు యూ ట్యూబ్ లో కూడా ట్రెండ్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా ఒక టాలెంటెడ్ స్టార్ హీరో గురించి గరికపాటి చెప్పిన విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మూఢ నమ్మకాలపై కూడా

ప్రస్తుతం ఉన్న అతి తక్కువ అవధానిలలో గరికపాటి నరసింహారావు ప్రముఖులు అని చెప్పవచ్చు. తెలుగు భాషా సాంస్కృతిని అలాగే ఆచారాలను, సంప్రదాయాలను తనదైన శైలిలో వివరణ ఇస్తుంటారు. మూఢ నమ్మకాలపై కూడా ఆలోచింపజేసేలా పద్యాలు పాడుతుంటారు. అలాగే ఆయన ప్రవచనాల్లో హాస్యం కూడా ఎక్కువగానే ఉంటుంది.

గతంలో సాయి పల్లవిపై పాజిటివ్ కామెంట్స్

విషయం ఏదైనా సరే నేటితరానికి అర్థమయ్యేలా ఉండాలని బోధన చేస్తుంటారు. అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా చాలా తెలివిగా అర్ధమయ్యేలా చెబుతుంటారు. గతంలో సాయి పల్లవిపై కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పొట్టి బట్టలు వేసుకోను, రేవు నా పిల్లలు కూడా నా సినిమా చూసేలా ఉండాలని సాయి పల్లవి తీసుకున్న నిర్ణయానికి గరికపాటి మెచ్చుకున్నారు. నా కూతురు లాంటి అమ్మాయి అని ఆమెను ఆశీర్వదించారు.

యువతరం ఎందుకు కలవలేకపోతోంది

ఇక పెద్దవాళ్ళతో యువతరం ఎందుకు కలవలేకపోతోంది అనే విషయంలో గురించి మాట్లాడిన గరికపాటి కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ను ఆ విషయంలోకి లాగుతూ అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చారు. ఒక విధంగా గరికిపాటి నరసింహారావు గారు సినిమాలను ఎంత బాగా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఏజ్ గ్రూప్ మాత్రమే తేడా

గరికిపాటి మాట్లాడుతూ.. మనం పిల్లలతో సరదాగా ఆడుకోవాలి అంటే మనం కూడా చిన్న పిల్లలు అయిపోవాలి. 90 ఏళ్ళ వాళ్ళతో మాట్లాడాలి అంటే అప్పుడు కూడా మన వయసు 90లోకి వెళ్ళాలి. అలా ఆలోచిస్తేనే వాళ్ళతో ఆనందంగా మాట్లాడగలం. ఈ తరం పెద్దవాళ్ళతో కలవకపోవడానికి కారణం ఏజ్ గ్రూప్ మాత్రమే తేడా.. అని చెప్పారు.

విక్రమ్ అంటే విక్రమే..

ఇక విక్రమ్ గురించి మాట్లాడుతూ.. విక్రమ్ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో వేషాలు వేస్తాడు. కమల్ హాసన్ లాగానే ఒకేసారి 16 రకాల వేషాలు వేస్తాడు. బాగా ముసలి వాడి వేషం వేస్తాడు అలాగే వెంటనే కుర్రాడి వేషం వేస్తాడు. అమయకుడిగా, రౌడిగా ఎలా కనిపించినా కూడా అన్ని నచ్చేస్తాయి. విక్రమ్ అంటే విక్రమే.. ఆ విధంగా మనిషి అన్ని రకాలుగా ఉండగలగాలి అని అన్నారు.

ప్రతి దాంట్లో గెటప్ వేరు..

ఇక విక్రమ్ చేయబోయే కోబ్రా సినిమా గురించి కూడా మాట్లాడారు. విక్రమ్ చేయబోయే నెక్స్ట్ సినిమాలో ప్రొఫెసర్ గా, శాస్త్రవేత్తగా, ఒక మతబోధకుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా..ఇలా పలు రకాలుగా కనిపించబోతున్నాడు. ప్రతి దాంట్లో గెటప్ వేరు. అతను ఏ పాత్ర చేసినా కూడా దాన్ని బాగా ఫీల్ అవుతాడు. అందులోకి వెళతాడు. ఐ సినిమాలో కూడా ఆ విధంగానే చేశాడు. అందుకే మనం కూడా అదే తరహాలో 90 ఏళ్ళు ఉన్నట్లుగానే ఆ వయసు వాళ్ళతో సమానంగా మాట్లాడాలి. అప్పుడే వారి కష్టాలు కూడా అర్థం అవుతాయి.. అని గరికపాటి వివరణ ఇచ్చారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here