స్టార్ డైరెక్టర్ కుమార్తె ఇంట్లోనే ప్రియుడితో సహజీవనం

0
27

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నటిగా పరిచయం కాకముందే ఈ భామ హాటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. బికినీ.. టూపీస్ లతో అలియా చేసే హడావుడి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ ఎంట్రీకి ముందే అలియా డేటింగ్ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

షేన్ గ్రోగేయ్ అనే యువకుడితో అలియా కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇద్దరు సన్నిహితంగా మెలిగిన ఫోటోలు ఇప్పటికే చాలాసార్లు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసినదే. తాజాగా అలియా తండ్రి అనుమతితో ఏకంగా ఇంట్లోనే ప్రియుడితో కాపురం పెట్టేసిందని తెలుస్తోంది.

తండ్రీ-కూతుళ్లిద్దరి ఫోన్  సంభాషణనే  అందుకు  సాక్ష్యంగా నిలిచింది. ఆ మధ్య  నేరుగా తండ్రితోనే అఫైర్స్ గురించి చర్చించిన వీడియో అంతర్జాలంలో వైరల్ అయ్యింది. నా బోయ్ ఫ్రెండ్ షిప్ మీకు ఇష్టమేనా డాడీ అంటూ అలియా నేరుగా లైవ్ లోనే అనుమతి అడగగా! దానికి అనురాగ్ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. షేన్ చాలా మంచివాడు. ఎవరితో స్నేహం చేయాలనే విషయంపై అతనికి మంచి అవగాహన ఉంది. తనలో ఎన్నో మంచి లక్షణాలున్నాయి. అతనితో మాట్లాడినప్పుడు మంచి కుర్రాడిలాగే అనిపించాడు. గోహెడ్ బేబి అంటూ అలియాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసాడు.

దీంతో అలియా మరో అడుగు ముందుకేసి షేన్  గ్రెగోయ్ ని ఏకంగా ఇంటికే తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇద్దరు ఒకే ఇంట్లో..ఒకే గదిలో ఉంటున్నారు. పక్క రూమ్ లో తండ్రి కూడా ఉంటున్నాడుట.  ముగ్గురు కలిసి భోజనం చేయడం..బయట తిరగడం.. నైట్ పార్టీలంటూ ఒకే కుటుంబంగా జీవిస్తున్నట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి.  దీనిపై నెటిజనుల కామెంట్లు పిచ్చెక్కిస్తున్నాయి.  పెళ్లి కాకుండానే అలియా ఇంట్లోనే ప్రియుడ్ని పెట్టుకోవడం ఏమిటో అంటూ కొందరు మండిపడుతుండగా.. మరికొంత మంది అలియా అన్ని ఇంట్లో చెప్పి చేయడం గర్వించదగ్గ విషయమని.. అందుకు ఎంతో ధైర్యం ఉండాలని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

పెళ్లికి ముందే గర్భవతి అయితే..!!

మీ అమ్మాయి ప్రేమలో పడింది.. కూతురు పెళ్లికి ముందే గర్భవతి అయితే ఏం చేస్తారు?  మీ అమ్మాయి  తాగి అరిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఏ తండ్రిని అయినా అడిగితే ఆయన మనోభావాలు ఎలా ఉంటాయి?  ఎంపిక చేసిన సంస్కృతి నేపథ్యం నుంచి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒక్కొక్కరి నుంచి ఒక్కోలా ఉంటుంది.

అయితే అల్ట్రా మోడ్రన్ డాడీ అనురాగ్ కశ్యప్ నుంచి ఆన్సర్లు అన్నీ చాలా జోవియల్ గా పరిణతితో కూడుకున్నవి అనడంలో సందేహమేం లేదు. ఫాదర్స్ డే సందర్భంగా ఆలియా కశ్యప్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఆమె తండ్రి అనురాగ్ కశ్యప్ ని ఇంటర్వ్యూ చేశారు. వీడియోలో అభిమానులు పంపిన ప్రశ్నలను ఆలియా తన తండ్రిని అడిగారు. “ఆలియా ప్రియుడు షేన్ గ్రెగోయిర్ గురించి కశ్యప్ ఏమనుకుంటున్నాడు?“ అన్న ప్రశ్నకు సమాధానంగా.. “నాకు షేన్ అంటే ఇష్టం. మంచి స్నేహితుడిని ఎలా ఎంచుకోవాలో నా కూతురికి తెలుసు. అతను చాలా ఆధ్యాత్మికతతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి 40 మంది మగాళ్లలో లేని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. క్లిష్ట పరిస్థితులలో అతడు గొప్పవాడిగా ఉంటాడు..“ అని అనురాగ్ అన్నారు.

అనేక సందర్భాల్లో ఆలియా తాగినప్పుడు అనురాగ్ పై అరిచిందనీ తెలిపాడు. తాగినప్పుడు తన కుమార్తె విషయంలో ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు సమాధానమిది. “మీరు చాలా చేసారు. ప్రతిసారీ పార్టీలో ఉన్నప్పుడు మీరు డయల్ చేసారు. మీరు అల్మరా లోపల కూర్చుని నాతో మాట్లాడారు. పార్టీలో ఉన్న మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పి అందరితో మాట్లాడేలా చేసారు. మీరు ప్రతి ఒక్కరినీ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ నుండి డైలాగ్స్ చెప్పేలా చేసారు“ అంటూ ఆలియా తెలిపారు. “మీరు(గాళ్స్) తాగినప్పుడు మాట్లాడటం చాలా సరదాగా ఉంటుంది… కానీ ప్రతిసారీ మీరు అలా చేయరు అని అనురాగ్ అన్నారు.

ఆలియా ఒక చమత్కార ప్రశ్న అడిగారు. తన కుమార్తెకు సెక్స్ గురించి చెప్పాల్సి వస్తే.. ప్రతిదీ దాచుకోవాల్సిన అవసరం లేదని గతంతో పోలిస్తే ఇప్పుడు అంతా మారిందని అనురాగ్ అన్నారు. గతంలో సెక్స్ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. శృంగారం అంటే శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్. కానీ దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి నేను వివరిస్తాను. మంచేంటే చెడేంటో తన కుమార్తెకు చెబుతానని అనురాగ్ అన్నారు.

పెళ్లికి ముందే గర్బం వస్తే ఏం చేస్తారు? అన్నదానికి.. తన నిర్ణయం ఏమిటో తెలుసుకుని దానిని గౌరవిస్తానని అనురాగ్ అన్నారు. కుమార్తెకు మద్దతుగా నిలుస్తాను.. కానీ దాని మూల్యాన్ని భరించాల్సింది నువ్వే“ అని కూడా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here