సోనూ సూద్ పై.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

0
26

కరోనా మహమ్మారి కారణంగా సర్వం కోల్పోతున్న అభాగ్యులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న సహాయం మాటల్లో వర్ణించలేనిది. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు సోనూ. తాజాగా.. కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గురించి కీలక ప్రతిపాదనలు ముందుకు తెచ్చాడు సోనూ.

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య అందించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసింది హీరోయిన్ ప్రియాంక చోప్రా. సోనూ దూరదృష్టి కలిగిన పరోపకారి అంటూ కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ లో పెద్ద పోస్టు రాసుకొచ్చారు.

ప్రతీ ఒక్కరికి విద్య అనేది పుట్టుకతో వచ్చిన హక్కుగా భావించే తాను.. ఈ విషయంలో సోనూకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది ప్రియాంక. మొదటగా సోనూ సూద్ నిశితమైన పరిశీలన తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు ప్రియాంక.

అదేవిధంగా కష్టతరమైన విషయాన్ని సోనూ తనదైన శైలిలో పరిష్కారం కోసం ఆలోచించడం.. సలహాలతో ముందుకు రావడం తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు ప్రియాంక. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు ప్రభుత్వేతర శక్తులు కూడా స్పందించి ముందుకు రావాలని ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here