సోనూసూద్ రియల్ ప్రేమ కథ

0
26

సోనూ సూద్ గురించి తెలియని వారు ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఉండరేమో. అంతలా తన సాయాలతో ఆయన పేరు సంపాదించుకున్నాడు. సినిమాలు చేసినా.. కానీ అక్కడ సంపాదించి పేరు ప్రఖ్యాతులు తక్కువనే చెప్పాలి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనూ ఎక్కువ నెగటివ్ రోల్స్ లోనే ఆకట్టుకున్నాడు. తాను చేసిన నెగటివ్ రోల్స్ చాలా హిట్టయ్యాయి. అడపాదడపా హీరోగా చేసిన కానీ తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం నెగటివ్ రోల్స్ అనే చెప్పాలి. అంతలా సోనూ సూద్ నెగటివ్ రోల్స్ కు పెట్టింది పేరులా మారిపోయారు. ఆయన తెలుగు లో చేసిన సినిమాలలో ఎక్కువగా తనకు గుర్తింపును తీసుకువచ్చింది అరుంధతి మూవీలో చేసిన పశుపతి క్యారెక్టరే. ఈ మూవీలో అతడి క్యారెక్టర్ ప్రధాన పాత్ర కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అతడికి తెలుగు రాకపోయినా వేరే తెలుగు వ్యక్తి డబ్బింగ్ చెప్పినా కానీ అతడు చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. పలువురు విమర్శకులు కూడా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ రోజు సోనూ సూద్ జన్మదినం. సోనూ సూద్ ది కూడా ప్రేమ వివాహం కావడం గమనార్హం. తన భార్య సోనాలి ఆయన స్టూటెండ్ గా ఉన్నప్పటి నుంచే ప్రేమించి అనంతరం వివాహం చేసుకున్నాడు.

సోనూసూద్ ఇంజనీరింగ్ చదువే రోజుల్లో ఎంబీఏ చదివే సోనాలి అతడికి పరిచయమైంది. తొలి పరిచయంలోనే ఇరువురూ ఒకరిని ఒకరు బాగా ఇష్టపడ్డారు. ఇలా వారి అభిరుచులు కూడా కలవడంతో ఇక ఆగలేకపోయారు. లవ్ ను ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఇంతకంటే పెద్ద కారణం ఇంకా ఏమీ అవసరం లేదేమో. వారిరువురూ ప్రేమించుకుంటున్నట్లు పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించడంలో సఫలం  అయ్యారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సోనూసూద్ సోనాలి 1996లో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత సోనాలి ఓ సంస్థలో ఉద్యోగం చేసింది. ఆ సమయంలో సోనూ సూద్ మోడలింగ్ చేసేవాడు.

ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. అందరి ప్రశంసలు అందుకుంటున్న సోనూసూద్ భార్య మన తెలుగు రాష్ర్టాలకు చెందిన అమ్మాయి కావడం మనకు గర్వకారణం. సోనూ సూద్ కూడా జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. మోడలింగ్ చేసేటపుడు తినేందుకు తిండి లేక ఉండేందుకు ఇళ్లు లేక నూతన దంపతులైన సోనాలి సోనూ చాలా అవస్థలు పడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మాత్రం వారు కలిసే జీవించారు. మరి కొందరికి ఆదర్శంగా నిలిచారు. కాగా సోనూసూద్ నటనారంగంలోకి అడుగుపెట్టాక… వీరి ఆర్థిక కష్టాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. సినిమాల్లోకి రావాలని మొదట సోనూసూద్ నిర్ణయం తీసుకున్నపుడు సోనాలి చాలా కంగారు పడింది. కానీ నటన మీద సోనూసూద్ కు ఉన్న ఇష్టాన్ని చూసి అతడి నిర్ణయాన్ని వద్దని చెప్పలేకపోయింది. అప్పుడు నటనా రంగంలోకి రావాలని సోనూ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రస్తుతం వారు ఆనందంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here