సోను సూద్ ను కొడుతుంటే తట్టుకోలేకపోయిన పిల్లాడు.. ఒక్క దెబ్బకు టీవీ బద్దలైంది..స్పందించిన రియల్ హీరో

0
10

సినిమాలో నటీనటుల గురించి సరిగ్గా తెలియని వారికి కూడా ఇప్పుడు సోనూసూద్ అంటే ఎవరో తెలుసు. విలన్ గా చాలా సినిమాల్లో బ్యాడ్ గా కనిపించిన సోనూ రియల్ లైఫ్ లో మాత్రం ఒక ఆపద్బాంధవుడిగా కనిపించాడు. కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఇటీవల ఒక చిన్న పిల్లవాడు సోనూసూద్ పై చూపించిన అభిమానానికి అందరూ షాక్ అయ్యారు. అతను ఏకంగా ఇంట్లో టీవీని పగలగొట్టేశాడు.

మనసున్న మనిషిగానే

సినీ నటుడిగా సోనూసూద్ పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రల్లో నటించాడు. నటుడిగా కంటే కూడా మంచి మనసున్న మనిషిగానే సోనూసూద్ ఎక్కువగా గుర్తింపు అందుకున్నాడు. సహాయం కోసం తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు.

కోట్లాది రూపాయల ఖర్చుతో

ట్విట్టర్ ద్వారా సోనూసూద్ నిమిషాల్లో హెల్ప్ చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఆరోగ్య పరంగానే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా చాలామంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశాడు. రైతులకు కూడా అండగా నిలబడ్డాడు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్స్ ను నిర్మించి సెకండ్ వేవ్ లో మరింత కష్టపడ్డాడు.

సోనూసూద్ పై అమితమైన ప్రేమ

అయితే ఇన్ని రకాలుగా సహాయలు చేస్తుండడంతో సోనూసూద్ కు అభిమానుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. పసి పిల్లలు నుంచి.. పండు ముసలి వరకు సోనూ సూద్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో ఒక పిల్లాడు సోనూసూద్ పై చూపించిన ప్రేమ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది.

టీవీపై బండరాయి

సంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాల్‌కల్‌లోని విరాట్ అనే కుర్రాడు రీసెంట్ గా టీవీలో సినిమా చూస్తూ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. మహేష్ బాబు దూకుడు సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అందులో విలన్ ను చితకబాదడం అతనికి నచ్చలేదు. అయితే సడన్ గా బయటకు వెళ్లి ఒక బండ రాయి తీసుకోవచ్చి టీవీపైకి విసిరాడు.

ఒక్క దెబ్బకి టీవీ మొత్తం ముక్కలైంది

ఒక్క దెబ్బకి టీవీ మొత్తం ముక్కలైంది. కోవిడ్ కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసినా సోనూసూద్ ను అలా కొట్టడం తనకి నచ్చలేదని అందుకే అలా చేసినట్లు ఆ బాలుడు తల్లిదండ్రులకు సమాధానం ఇచ్చాడు. ఇక ఆ విషయం ఆ నోటా ఈ నోటా పలకడంతో నేషనల్ మీడియా వరకు వెళ్లింది

స్పందించిన సోనూసూద్

ఇక పిల్లాడు చేసిన పని సోనూసూద్ వరకు రావడంతో వెంటనే స్పందించాడు. అరే.. మీ టీవీని అలా బద్దలు కొట్టవద్దు. మీ నాన్న కొత్త టీవీని కొనమని నన్ను అడుగుతాడేమో అంటూ సోనూసూద్ సరదాగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం సౌత్ లో కొన్ని పెద్ద సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. ఆచార్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here