సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తానన్న అభిమాని

0
30

టాలీవుడ్ స్టార్ హీరోల డైహార్డ్ ఫ్యాన్స్ గురించి తెలిసినదే. తమ అభిమానుల్ని నిరాశపరచకుండా కొందరు హీరోలు ఆన్ లొకేషన్ కి పిలిపించుకుని మరీ సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు వీకెండ్స్ లో ఇంటికే పిలిపించుకుని సెల్ఫీలు ఫోటోలతో అభిమానుల్ని సంతుష్టుల్ని చేస్తున్నారు.

ఇక నేచురల్ స్టార్ నానీకి ఆన్ లొకేషన్ ఎదురైన అనుభవం షాకిచ్చేదే. తన డైహార్డ్ అభిమానులలో ఒకరు `శ్యామ్ సింఘరాయ్` సెట్స్ కి వచ్చి తనతో సెల్ఫీ దిగాల్సిందేనంటూ పట్టుబట్టాడట. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు నానితో సెల్ఫీ దిగాడట.

“మీరు నాతో సెల్ఫీ దిగకతే.. నేను ఇక్కడ షూటింగ్ జరగనివ్వను“ అని  డైహార్డ్ ఫ్యాన్ ఫన్నీగానే హెచ్చరించినంత పని చేశాడట. నాని ఆ క్షణం ఎంతో ఆశ్చర్యపోయాడట. హెచ్చరికతో ఆకట్టుకున్న తన అభిమానితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇటీవల నాని కొందరు అభిమానులను కలుసుకుని సెల్ఫీలు దిగారట. షూటింగ్ విరామ సమయంలో తన అభిమానులతో గడిపారని తెలిసింది.

సెకండ్ వేవ్ ప్రభావంతో శ్యామ్ సింఘరాయ్ షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మహమ్మారి శాంతించాక తిరిగి షూట్ ప్రారంభిస్తారు. భారీ ఎత్తున నిర్మించిన కోల్ కత సెట్స్ లో ఈ షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృతన్ దర్శకుడు‍. సాయి పల్లవి‍‍‍- కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here