సూపర్ హిట్ రీమేక్ పై ఆసక్తి లేదన్న రష్మిక

0
15

ఈమద్య కాలంలో ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాలో ఇతర భాషల్లో రీమేక్ అవుతూ వస్తున్నాయి. ఉత్తరాది సినిమాలు ఇక్కడ.. ఇక్కడి సినిమాలు ఉత్తరాదిన రీమేక్ అవుతున్నాయి. కన్నడ సూపర్ హిట్ మూవీ కిర్రాక్ పార్టీ ని హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఆ రీమేక్ రూపొందబోతున్నట్లుగా ఇటీవల బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కిర్రాక్ పార్టీ హిందీ రీమేక్ లో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించబోతుండగా ఆయనకు జోడీగా రష్మిక మందన్నా ను ఎంపిక చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని రష్మిక క్లారిటీ ఇచ్చింది.

కన్నడ కిర్రాక్ పార్టీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించిన విషయం తెల్సిందే. రీమేక్ లో ఒరిజినల్ వర్షన్ హీరోయిన్ ను నటింపజేస్తే బాగుంటుందని మేకర్స్ భావించగా సున్నితంగా తిరష్కరించిందట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయమై స్పందించింది.. కిర్రాక్ పార్టీ హిందీ రీమేక్ లో నటించే ఆసక్తి నాకు లేదు. ఎందుకంటే ఇప్పటికే నేను ఆ పాత్ర ను కష్టపడి చేశాను. రీమేక్ చేస్తే మళ్లీ కొత్తగా చేసేది ఏమీ ఉండదు. అందుకే కొత్తగా ప్రతి సినిమాలో విభిన్నంగా కనిపించాలని నేను అనుకుంటున్నాను. అందుకే రీమేక్ పై ఆసక్తి లేదని కిర్రాక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె పుష్ప సినిమా లో నటించడంతో పాటు తమిళం.. హిందీ.. కన్నడంలో కూడా నటిస్తోంది. సౌత్ లో బిజీ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ రష్మిక మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. మరో వైపు బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఇన్ని సినిమాలు చేస్తున్న ఈమె హిందీ లో కిర్రాక్ పార్టీని మాత్రం చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here