సుశాంత్ కేసులో మరో అరెస్ట్,కరణ్ డ్రగ్ పార్టీపై నిఘా,రెడ్ హ్యాండెడ్గా దొరికిన వికీ కౌశల్,మలైకా,దీపిక

0
42

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు మరో అరెస్ట్ చేశారు. కర్మత్‌జిత్ అలియాస్ కేజే‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. గోవా, ముంబైలో భారీగా సోదాలు నిర్వహించిన అనంతరం ఆయన నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబైలో యదేఛ్చగా డ్రగ్స్

ముంబైలోని కాప్రి, లిటిల్ హైట్స్ ప్రాంతాల్లో కరమ్ జిత్ డ్రగ్స్ సరఫరా చేసేవారు. శ్యాముల్ మిరాండా, షోవిక్ చక్రవర్తిలకు నేరుగా డ్రగ్స్ అందించేవారు. వారు ఆ తర్వాత రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చేరవేసేవాళ్లు అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. విచారణలో భాగంగా షోవిక్ వెల్లడించిన వివరాల ఆధారంగా కరమ్ జిత్ నివాసాలు, అడ్డాలపై దాడులు నిర్వహించినట్టు తెలిపారు.

ఏప్రిల్ నెలల సరఫరా అంటూ షోవిక్

ఏప్రిల్ మాసంలో సుశాంత్ నిషేధిత డ్రగ్స్ కావాలని కోరారు. దాంతో శ్యామూల్ మిరాండా డ్రగ్స్ సప్లయిదారులను సంప్రదించారు. బాసిత్, హాషిష్ నుంచి సుమారు 7 వేల రూపాయలకు 10 గ్రాముల చొప్పున డ్రగ్స్ తీసుకొన్నామని చెప్పినట్టు అధికారులు వెల్లడించారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, దీపేశ్ సావంత్, శ్యాముల్ మిరాండా, జేయిద్ వాత్రా, బాసిత్ పరిహార్‌ను అరెస్ట్ చేశారు. వీరికి సెషన్స్ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.

కరణ్ జోహర్ పార్టీపై డేగ కన్ను

ఇదిలా ఉండగా, ఈ అరెస్టుల తర్వాత ప్రస్తుతం ఎన్సీబీ అధికారులు దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీపై దృష్టి పెట్టినట్టు సమాచారం. గతేడాది అంటే 2019 జూలై 30న జరిగిన పార్టీలో వికీ కౌశల్, దీపిక పదుకోన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, వరుణ్ దేశాయ్, జోయా అఖ్తర్, ఆయన్ ముఖర్జీ, షుకున్ బాత్రా తదితరులు ఉన్నారు.

వివాదంగా మారిన కరణ్ జోహర్ వీడియో

కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీ వీడియోను కరణ్ జోహర్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో రిలీజ్ చేయగా దానిని ఎంఎల్‌ఏ మజిందర్ ఎస్ సిర్సా షేర్ చేయడంతో ఆ వీడియోపై విమర్శల దాడి జరిగింది. ఓ దశలో వివాదంలో కూరుకుపోయినట్టు కనిపించింది.

డ్రగ్స్ పక్కనే పుట్టుకొని వికీ కౌశల్, వరుణ్ ధావన్

కరణ్ జోహర్ షేర్ చేసిన వీడియోలో బాలీవుడ్‌లో స్టార్ హీరోలు, హీరోయిన్లు మత్తులో జోగుతూ కనిపించారు. ఇక వికీ కౌశల్ తన పక్కనే టేబుల్‌పై కొకైన్‌గా భావిస్తున్న డ్రగ్స్‌ను పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అలానే దీపిక పదుకోన్, మలైకా ఆరోరా మత్తులో మునిగి తేలినట్టు స్పష్టంగా కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here