సుశాంత్ కేసులో మరొకరు అరెస్ట్

0
20

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి సంబంధించిన కేసు విచారణ కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ కు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో సుశాంత్ మృతి కేసు కాస్త డ్రగ్స్ సరఫరా వైపు వెళ్లింది. సుశాంత్ కు డ్రగ్స్ సప్లై చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉంది. బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె ను అధికారులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఈ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారి విచారణ జరుగుతున్న ఈ సమయంలోనే మరి కొందరికి కూడా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా ఎన్ సీ బీ అధికారులు భావించారు. వారు భావించినట్లుగానే మరి కొందరి పేర్లు కూడా ఈ కేసులో బయటకు వచ్చాయి. ఇటీవల హేమల్ షా అనే వ్యక్తి కి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయన్ను ట్రేస్ చేసి గోవాలో అరెస్ట్ చేయడం జరిగిందట. ఈ కేసులో ముందు ముందు మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు.

గోవాలో హేమల్ షా ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇప్పటికే కోర్టు ముందు ప్రవేశ పెట్టి విచారణకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. రియా చక్రవర్తి సోదరుడికి కూడా ఈ కేసుతో సంబంధం ఉందనే వార్తలు వచ్చాయి. బాలీవుడ్ కు చెందిన కొందరు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. మొత్తంగా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరకు ఎక్కడికి చేరుతుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here