సీనియర్ హీరోయిన్లతో దర్శకుల లాలూచీ దేనికి?

0
33

పేరున్న కథానాయికల్ని ఒప్పించి తమ సినిమాల్లో నటింపజేస్తే వెయిట్ పెరుగుతుందనేది దర్శక హీరోల ఆలోచన. ఆ కోవలో చూస్తే త్రివిక్రమ్.. సుకుమార్.. కొరటాల.. అనీల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్లు ఈ ధోరణిని ఎక్కువ ఇష్టపడతారు. వరుసగా అగ్ర హీరోలతో పని చేసే ఈ దర్శకులు వెటరన్ హీరోయిన్లతో లాలూచీ నడిపించడం పలుమార్లు చర్చనీయాంశమైంది.

తమ సినిమాల్లో వెటరన్ కథానాయికలకు చెప్పుకోదగ్గ అవకాశాల్నే కల్పిస్తున్నారు వీరంతా. కథలో వెయిట్ ఉండే పాత్రల్ని ఆఫర్ చేస్తూ వెటరన్స్ కి అవకాశం కల్పించడం మెచ్చదగిన ప్రయత్నం అనాలి.

ఇక అగ్ర హీరో మహేష్ తో వరుసగా పలువురు సీనియర్ నాయికలు నటించిన సంగతి తెలిసిందే. నదియా- ఖుష్బూ- దేవయాని – టబు- విజయశాంతి ఇప్పటికే మహేష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు శిల్పా శెట్టి మహేష్ తదుపరి సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ -హారిక బృందాలు శిల్పాజీని లాక్ చేయడం చర్చనీయాంశమైంది.

ఇంతకుముందు నదియా – పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో నటించారు. ఖుష్బూ మెగాస్టార్ స్టాలిన్ లో నటించారు. టబు 2021సంక్రాంతి బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించారు. బన్ని ఇందులో హీరో. విజయశాంతి తదుపరి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఆఫర్ వస్తే నటించేందుకు సిద్ధమేనని అన్నారు. మెగా కాంపౌండ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి అవకాశాన్ని పరిశీలిస్తోందన్న టాక్ ఉంది.

ఇక దేవయాని ప్రస్తుతం నాగచైతన్య – శేఖర్ కమ్ముల చిత్రం లవ్ స్టోరిలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కి రావాల్సి ఉంది. స్నేహ ఇంతకుముందు పలువురు టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాల్లో నటించి మెప్పించారు. బన్ని-త్రివిక్రమ్ జోడీ సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ రోల్ ఎంతగా వర్కవుటైందో తెలిసిందే. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ నటిగానూ స్నేహ గ్లామర్ యువతరాన్ని మెప్పించింది. ప్రభాస్ .. ఎన్టీఆర్ వంటి స్టార్లు అగ్ర దర్శకులతో చేసిన చాలా సినిమాల్లో సీనియర్ నాయికలతో ప్రత్యేక ఆకర్షణను జోడించారు. వెటరన్ నాయికల గ్లామర్ ఒక రకంగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండగా.. వారి నుంచి ఔట్ పుట్ కూడా అంతే ఈజీగా రాబట్టుకునేందుకు దర్శకులకు ఆస్కారం ఉంటుంది. అందుకే వారితో లాలూచీ పెట్టుకుంటారన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here