సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఇకలేరు.. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి

0
10

సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు సామాజిక కార్యకర్త కత్తి మహేష్ ఇకలేరు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తొలుత నెల్లూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే కొద్ది రోజులుగా కొలుకొంటున్నట్టే కనిపించిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కత్తి మహేష్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి..

నెల్లూరు జిల్లా వద్ద రోడ్డు ప్రమాదానికి గురై

హైదరాబాద్ నుంచి తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్తూ నెల్లూరు వద్ద జూన్ 26వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే అతడిని నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను చెనైకి తరలించారు.

చెన్నైలో మెరుగైన వైద్యం

చెన్నైకి తరలించిన తర్వాత కంటికి చికిత్స, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, తదితరల చికిత్సలు చేయించారు. అయితే ఆయనకు ఓ కన్నుపూర్తిగా పాడైపోయిందని శంకర్ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు. ఆయనకు మెరుగైన చికిత్స అవసరమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల సహాయాన్ని ముఖ్యమంత్రి సంక్షేమ నిధి నుంచి అందజేశారు.

చిత్తూరు జిల్లాలో జన్మించి..

కత్తి మహేష్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ విద్యను అభ్యసించారు. అనంతరం సినీ క్రిటిక్‌గా కెరీర్ ప్రారంభించి… దర్శకుడిగా మారారు. అనంతరం పలు చిత్రాల్లో చిన్న చిన్న వేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఇటీవల కాలంలో నటుడిగా బిజీ అవుతున్న తరుణంలో విధివశాత్తూ మృత్యువు కబలించింది.

సినీ విమర్శకుడిగా, దర్శకుడిగా, నటుడిగా

కత్తి మహేష్‌కు సినీ రంగంపైనే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై విశేషమైన పరిజానం ఉంది. సినీ విమర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకొంటూనే దర్శకుడిగా మారారు. పెసరట్టు చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఎగిరే తారాజువ్వలు చిత్రాని దర్శకుడిగా వ్యవహరించారు. ఇటీవల రవితేజ నటించిన క్రాక్ చిత్రంతో మరింత పాపులరాటిని సంపాదించుకొన్నారు. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో సెలబ్రిటీగా పాల్గొన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here