సాయి పల్లవిని డబ్బుతో ప్రలోభపెట్టగలరా?

0
19

డబ్బుకు దాసోహం కానిది ఎవరు? అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కొందరికి సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. బలమైన పాత్ర.. మంచి కథ.. ప్రతిభావంతుడైన దర్శకుడు.. మంచి బ్యానర్ ఇన్నిటిని చూస్తారు. కొన్నిటి విషయంలో రాజీ పడినా కానీ.. బలమైన పాత్ర కుదరకపోతే ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉండని నటిగా సాయిపల్లవికి పేరుంది. పెద్ద ప్యాకేజీ ఆఫర్ చేసినా కానీ నో చెప్పేయడం తనకు కొత్తేమీ కాదు.

ఇంతకుముందు పలువురు అగ్ర నిర్మాతలు భారీ పారితోషికాన్ని ఎరవేసినా కానీ తన పాత్ర కథ నచ్చకపోవడంతో నో చెప్పారు. దాంతో సాయిపల్లవికి తలబిరుసు అన్న ప్రచారం సాగించారు. కానీ అవేవీ తాను కేర్ చేయనని సాయి పల్లవి తన యాటిట్యూడ్ తో ప్రతిసారీ ఎదుటివారికి చెబుతూనే ఉన్నారు.
 
ప్రస్తుతం కెరీర్ పరంగా క్షణం తీరిక లేని ఈ బ్యూటీ ఇప్పటికే తాను ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి ప్రధాన బలం అని నిరూపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం..కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ నిర్మాత తన తదుపరి చిత్రంలో నాయికా ప్రధాన పాత్రను పోషించడానికి భారీ పారితోషికం ఆపర్ చేశారట. కానీ తన పాత్రను ఇష్టపడనందున సాయి పల్లవి నిర్మాతకు మొహమాటం అన్నదే లేకుండా `నో` చెప్పి పంపించారట. ఏదైనా తనకు బలమైన పాత్ర ఉంటేనే తన వద్దకు ప్రాజెక్టులను తీసుకురావాలని తన బృందానికి తెలియజేసారట. డబ్బు తనకు మ్యాటర్ కానే కాదని దీనిని బట్టి ప్రూవైంది. సాయి పల్లవి నటించిన `లవ్ స్టోరీ`..`విరాఠ పర్వం` రిలీజ్ కి రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here