సర్కారు వారి పాట ఫ్యాన్స్ మాస్ చర్చ

0
22

సూపర్ స్టార్ మహేష్ బాబు రెగ్యులర్ గా ఒకే తరహా సినిమాలు చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న సమయంలో ఆయన నుండి రాబోతున్న సర్కారు వారి పాట సినిమా వారికి గట్టి సమాధానం ఇస్తుందంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అనుకున్న తేదీకి అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల మాత్రం పక్కా అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈ సమయంలోనే ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి అభిమానుల్లో తెగ చర్చ జరుగుతోంది. అభిమానుల్లో జరుగుతున్న చర్చ మేరకు సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ బాబు డైలాగ్స్ అది కూడా మాస్ డైలాగ్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయట. గతంలో మాదిరిగా కాకుండా మహేష్ బాబు డైలాగ్స్ ప్రత్యేంకగా ఈ సినిమా లో ఉంటాయంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. దాంతో అభిమానులు మాస్ డైలాగ్స్ చర్చతో ఊగిపోతున్నారు.

సర్కారు వారి పాట సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక ఒక స్ట్రాంగ్ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి సర్కారు వారి పాట మహేష్ బాబు అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here