సమంత హనీట్రాప్?

0
23

గత కొంతకాలంగా సమంత సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మారుతోంది.  విభిన్న పాత్రలతో మెప్పిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లోనూ ఆమె తన సత్తాచాటుతోంది. స్టార్ హీరోయిన్ గా కోట్లాది అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన సమంత అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తుంది…బోల్డ్ రోల్స్ చేస్తోంది. ఆ మధ్యన సమంత సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంలో అలాంటి పాత్రే చేసింది. ఆ పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. కోలీవుడ్ తో పాటుటాలీవుడ్ లోనూ ఆ పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి సమంత ..ఓ బోల్డ్ రోల్ లో కనిపించనుంది.

సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సెకండ్ సీజన్  త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో పాకిస్థానీ అమ్మాయిగా సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని సమాచారం.  ఆ పాత్ర ప్రకారం ఆమె బోల్డ్ గా బిహేవ్ చేస్తుందని తన పనులు అవ్వటం ఎంతకైనా తెగిస్తుందని హనీట్రాప్ లాంటి క్యారక్టర్ అని వినపడుతోంది. టెర్రరిజం యాంగిల్ కలిగిన ఈ పాత్ర  పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందీ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.

ఈ సీరిస్ ని డైరక్ట్ చేస్తున్న డీకే అండ్ రాజ్ చెప్పేదేమిటంటే…సమంత చేసే పాత్ర ఆమె కెరీర్ లోనే బోల్డెస్ట్ రోల్ ట. అది ఆమె కు ఓ గేమ్ ఛేంజర్ గా మారుతుంది అంటున్నారు.

‘ఫ్యామిలీ మెన్ 2’  లో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు షరీబ్ హష్మీ మీడియాతో మాట్లాడుతూ.. సమంతపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘సమంత పాత్ర జబర్దస్త్గా ఉంటుంది. ఆమె లుక్ చూస్తే పడిపోతారు. ఆమె అద్భుతమైన సహ నటి గొప్ప వ్యక్తి.  ఈ సిరీస్లో సర్ప్రైజింగ్ రోల్ పోషించారు. సమంత గతంలో చేసిన పాత్రలతో పోల్చితే ఇది పూర్తి విభిన్నంగా ఉంటుంది ఏ మాత్రం సంబంధం ఉండదు’ అని ఆయన అన్నారు. యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఆఫీసు చుట్టూ సాగిన ఫస్ట్ పార్ట్ లో మనోజ్ నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఏజెంట్గా కనిపించారు. కాగా రాబోతున్న సీజన్లో సమంత టెర్రరిస్ట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here