సమంత శాకంతలం మూవీలో అల్లు అర్జున్ కూతురు అర్హ… చరిత్రాత్మక పాత్రలో గ్రాండ్ ఎంట్రీ!

0
12

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లోకి రావాల్సిన వారాసులు చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే మూడవ తరం వారే ఎక్కువగా కొనసాగుతున్నారు. ఇక మొదటిసారి అల్లు వారి ఫ్యామిలీ నుంచి నాలుగవ జనరేషన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అదికూడా ఒక చారిత్రాత్మక పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తుండడం విశేషం అని చెప్పవచ్చు.

ఆ విషయం ముందే పసిగట్టారు

అల్లు అర్హ సినిమాల్లోకి తప్పకుండా వస్తుందని అభిమానులు ముందు నుంచే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్నారి కెమెరాకు స్టిల్స్ ఎవ్వడంలో ఎంతో అనుభవం ఉన్నట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా ఇదివరకే అర్హ పుట్టినరోజు సందర్భంగా అంజలి అంజలి పాటను షూట్ చేయగా అందులో అమ్మడు క్యూట్ హావభావాలతో ఎంతగానో ఆకట్టుకుంది.

శాకుంతలం సినిమాలో అర్హ

తండ్రిలాగే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని అందరికి అర్ధమయ్యింది. దీంతో అర్హ వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ ఒక ముఖ్యమైమ పాత్రలో నటిస్తున్నట్లుగా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ప్రిన్స్ భరత పాత్రలో..

ప్రిన్స్ భరత పాత్రలోనే అల్లు అర్హ నటిస్తున్నట్లు కూడా వివరణ ఇచ్చేశారు. అసలైతే మొదట పిల్లలతో ప్రత్యేకంగా నిర్మించే సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు గుణశేఖర్ లాంటి దర్శకుడితో ఎంట్రీ ఇస్తుంది అంటే అల్లు అర్హ లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే గుణశేఖర్.. ఎన్టీఆర్ ను మొదట బాల రామాయణం ద్వారా వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.

స్పందించిన అల్లు అర్జున్

ఇక అల్లు అర్జున్ కూడా కూతురి ఎంట్రీపై కూడా వివరణ ఇచ్చారు. నాల్గవ తరం అల్లు అర్హా శకుంతలం చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నందుకు అల్లు కుటుంబ సభ్యులకు గర్వకారణం. నా కుమార్తెకు ఈ అందమైన సినిమాలో తొలిసారిగా అవకాశం ఇచ్చినందుకు గుణశేఖర్ గారికి అలాగే నీలీమా గుణ గారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. అని అల్లు అర్జున్ చిత్ర యూనిట్ సబ్యులకు కూడా బెస్ట్ విషెస్ అందించారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here