సక్సెస్ వచ్చినా గిఫ్ట్స్ ఏంరాలేదు: ‘వకీల్ సాబ్’ డైరెక్టర్

0
25

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవలే స్టార్ హీరో – దర్శకుడు కాంబినేషన్ లో మూడేళ్లు గ్యాప్ అనంతరం తెరమీదకు వచ్చిన సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి నుండి చివరి సినిమాలు 2017లో విడుదలయ్యాయి. అయితే ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నప్పటికి పవన్ కళ్యాణ్ – వేణుశ్రీరామ్ ఇద్దరూ వకీల్ సాబ్ తో మాస్ రీఎంట్రీ అందుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ రీమేక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వకీల్ సాబ్ మూవీ హిట్ అటు హీరోకు ఇటు దర్శకుడికి మంచి నేమ్ తెచ్చిందని చెప్పాలి.

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దర్శకుడు పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమా సూపర్ హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. అందుకు లేటెస్ట్ ఉప్పెన సినిమానే ఉదాహరణ. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో నిర్మాతలు డైరెక్టర్ బుచ్చిబాబుకు బెంజ్ కారు బహుమానంగా కొనిచ్చారు. కానీ వేణుశ్రీరామ్ వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించినా ఇంకా ఎలాంటి గిఫ్ట్ పొందలేదు అంటే షాక్ అవుతున్నారు సినీప్రేక్షకులు.

అయితే ఈ విషయం పై మరోసారి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ‘నేను ఇదివరకు ఎంసిఏ చేసాను. ఆ హిట్ సినిమాకు రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాను. కానీ వకీల్ సాబ్ సూపర్ హిట్ అయింది. దీనికి కూడా కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే పొందాను. ఇంకా ఏ బహుమానాలు నిర్మాతల నుండి రాలేదని చెప్పుకొచ్చాడు డైరెక్టర్. అలాగే నా డెబ్యూ మూవీ ఓమైఫ్రెండ్ ప్లాప్ అవ్వడంతో ఏడేళ్లు స్ట్రగుల్ అయ్యాను. పలు సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ కూడా చేసాను. కానీ ఎవరు క్రెడిట్స్ ఇవ్వలేదు. కానీ నా స్థానంలో సుకుమార్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాడినని అన్నట్లు చెప్పుకొచ్చాడు.  చూడాలి మరి ఇకనైనా డైరెక్టర్ గిఫ్ట్ అందుకుంటాడేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here