షాహిద్ కపూర్ కు నో చెప్పడానికి కారణం ఇదేః రష్మిక

0
30

హీరోయిన్ ఎవరైనా కావొచ్చు వారి అంతిమ లక్ష్యం బాలీవుడ్ లో జెండా ఎగరేయడమే. దీనికోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఎన్నో దండయాత్రలు చేస్తుంటారు. కానీ.. అలాంటి ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చినా.. నో చెప్పింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.

తెలుగులో నాని హీరోగా వచ్చిన జెర్సీ మూవీ.. సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అడిగితే.. తాను చేయనని చెప్పింది.

షాహిద్ కపూర్ కు ఎందుకు నో చెప్పాల్సి వచ్చిందో.. తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిందీ బ్యూటీ. జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని ఆ పాత్రకు ఆమెతప్ప మరెవరూ న్యాయంచేయలేరన్న ఉద్దేశంతోనే నో చెప్పిందట రష్మిక. ఈ బ్యూటీ రిజెక్ట్ చేయడంతో.. షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ ను తీసుకుంది యూనిట్.

కాగా.. ఇప్పుడు రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. ‘మిషన్ మజ్ను’ ‘గుడ్ బై’ చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. గుడ్ బై చిత్రంలో బిగ్ బి అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందీ బ్యూటీ. ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ కొట్టినా.. బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here