షాపుకెళ్లినా మాస్క్ తీయొద్దని రాశీ సందేశం

0
23

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం అన్ని బిజినెస్ లపైనా పడింది. కర్ఫ్యూ వాతావరణంతో షాపింగ్ ఏరియాలు బోసిపోయాయి. ఇప్పుడు పాక్షికంగా లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. ప్రమాదం కోరల్లో చిక్కుకున్న మానవాళి బిక్కుబిక్కుమంటూ ఉంది.

ఇదిగో ఇక్కడ చూస్తుంటే రాశీ ఖన్నా కూడా నిర్జనంగా ఉన్న ఒక షాప్ లో కనిపించిందిలా. ఖాళీ షాపే కదా అని మాస్క్ తీసారో! అన్నట్టే ఉంది తన వాలకం. గాలిలో 3గంటల పాటు నిలిచి ఉండే వైరస్ ఏ రకంగా అయినా కొంప కూల్చొచ్చన్న అలెర్ట్ నెస్ కనిపిస్తోంది. ఏదయితేనేం.. మాస్క్ తీయకుండా షాపుకెళ్లింది. సెల్ఫీ దిగి సందేశాన్నిచ్చింది.

అన్నట్టు ఇండస్ట్రీ సెల్ఫ్ లాక్ డౌన్ వల్ల రాశీకి పని లేకుండా పోయింది. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసి బాడీని షేపప్ చేస్తోందిట. ఆ లుక్ ఆ విషయాన్ని స్పష్ఠంగా చెబుతోంది. ఆరెంజ్ టాప్.. బ్లూ చినుగుల డెనిమ్స్ .. ఆ మొలకు చుట్టిన మకమల్ బ్లాక్ కోట్ కాంబినేషన్ ప్రతిదీ వారెవ్వా అనిపిస్తున్నాయి. కిల్లర్ లుక్ తో రాశీ కట్టి పడేస్తోంది. ఒకే ఫోటోలో ఇదొక కొత్త కోణం బయటపడింది. రాశీ నటించిన తమిళ చిత్రాలు రిలీజ్ లకు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ముందు కోవిడ్ అంతమవ్వాలి. ఆరు తమిళ చిత్రాలు సెట్స్ పై ఉండగా పక్కా కమర్షియల్.. థాంక్యూ అనే రెండు తెలుగు చిత్రాల్లోనూ రాశీ నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here