షాకింగ్ లుక్కులో దేవసేన

0
23

తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దకాలం పాటు ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి. ఇప్పుడున్న గ్లామర్ ప్రపంచంలో అలాగే సినిమాల్లో పాత చింతకాయ పచ్చడి కథలకు వెంటనే నో చెప్పేస్తున్నారు ప్రేక్షకులు. ఈ విషయం కొన్నేళ్లుగా జరుగుతుంది. విడుదల అవుతున్నటువంటి సినిమాలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోలు గాని హీరోయిన్లు గాని ఎవరైనా కథాకథనాలు సరిగా లేని సినిమాలు ఎంచుకుంటే మాత్రం ప్లాప్ తప్పనిసరిగా ఖాతాలో వేసుకోవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ నుండి అప్ కమింగ్ హీరోయిన్స్ వరకు అందరూ వైవిధ్యమైన కథల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఎందుకంటే అలాంటి సినిమాలు చేస్తేనే ఫ్యూచర్ ఉంటుందని త్వరగా గ్రహిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ఆ రేంజిలో హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అమ్మడికి హిట్టు కంపల్సరీ అయిపోయింది. మొన్నటివరకు అంటే 2017 నుండి అనుష్క నుండి కేవలం రెండు సినిమాలే వచ్చాయి. అవి రెండు కూడా ప్రయోగాలుగానే మిగిలిపోయాయి. 2018లో భాగమతి 2020లో నిశ్శబ్దం రెండూ కూడా బాక్సాఫీస్ ప్లాప్ లుగా నిలిచాయి. అయితే మళ్లీ వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అవుతోందని టాక్.

కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనుష్క లుక్ చూస్తే మాత్రం ఎవరు కూడా ఆమె అనుష్కే అనే నమ్మేలా లేదు. ఎందుకంటే ఈ మధ్యన అటు సోషల్ మీడియాలో ఎందులో కనిపించకపోయే సరికి ఫ్యాన్స్ అందరూ తదుపరి సినిమా కోసం నాజూకుగా తయారు అవుతుందేమో అనుకున్నారు. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇదివరకటి కంటే మరింత లావుగా మారింది అనుష్క. ముఖ్యంగా మొహం చూసే చెప్పేయొచ్చు. చూడటానికి ముద్దుగా బొద్దుగానే ఉంది కానీ ఇదివరకటి కళ కనిపించడం లేదు. మరి ఏం చేస్తుందో ఫ్యాన్స్ కు మాత్రం అర్ధం కావడం లేదు. ఫేస్ లో కూడా గ్లో లేదు. మరి సినిమాకోసమేనా లేకపోతే మాములుగానే ఇలా అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. అనుష్క ప్రస్తుతం మహేష్ అనే దర్శకుడితో సినిమా ఓకే చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here