శ్రీయ భర్త పాడు పనులు: లైవ్ వీడియోలో ఏకంగా ఎదపై ముద్దులు.. మరీ ఇంత దారుణమా!

0
8

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్సనల్ విషయాలను కూడా అందులో పోస్ట్ చేసేస్తున్నారు చాలా మంది నటీమణులు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. కొందరైతే భర్తతో చనువుగా ఉన్న వాటిని కూడా షేర్ చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఒకరు. వివాహం తర్వాత నిత్యం భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుందామె. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను వదిలింది. అందులో ఏకంగా శ్రీయ భర్త.. ఆమె ఎదపై ముద్దులు పెట్టాడు.

అలా ఎంట్రీ ఇచ్చిన శ్రీయ.. ఇలా ఫేమస్

మోడల్‌గా సక్సెస్ అయిన శ్రీయ శరణ్.. ‘ఇష్టం’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన ‘సంతోషం’తో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అనంతరం సోలో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలోనే పదుల సంఖ్యలో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా శ్రీయ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

టాలీవుడ్‌లో శ్రీయ హవా… రికార్డులతో

టాలీవుడ్‌లో శ్రీయ తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితోనూ ఆడిపాడింది. అలా కొన్నేళ్ల పాటు ఏడాది పది సినిమాల చొప్పున చేస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఆమె దూకుడుకు సినీ పెద్దలే ఆశ్చర్యపోయేవారు. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్‌లోనూ శ్రీయ అప్పట్లోనే ఎవరికీ అందనంత తీసుకునేది.

విదేశీయుడితో ప్రేమ.. ఎంజాయ్ చేస్తూ

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే విదేశీ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు లవ్ ట్రాకును నడిపిన తర్వాత 2018లో అతడిని వివాహం చేసుకుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హాట్ టాపిక్ అవుతోంది.

వేగం తగ్గించిన బ్యూటీ.. అందుకే అలా

గతంలో ఏడాది పది సినిమాల వరకూ చేస్తూ వచ్చిన శ్రీయ.. వివాహం తర్వాత సినిమాల తగ్గించేసింది. అడపాదడపా కొన్ని చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇక, ప్రస్తుతం ఆమె చేసిన సినిమాల్లో RRR ఒకటి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఆమె పూర్తి చేసేసింది. దీనితో పాటు పలు భాషల చిత్రాలు కూడా కంప్లీట్ చేసింది. కొన్ని వెబ్ సిరీస్‌లు చేయబోతుంది.

ఎప్పుడూ అందులోనే.. భర్తతో ఎక్కువ

చేతి నిండా ఆఫర్లతో బిజీ అయినా.. శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను కూడా భారీగా పెంచుకుంటోంది. ఈ మధ్య భర్తవే ఎక్కువ పోస్ట్ చేస్తోంది.

శ్రీయ భర్త పాడు పనులు.. దారుణంగా

తాజాగా శ్రీయ శరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఆండ్రీని హత్తుకుని ఉంది. లైవ్ చేస్తున్న సమయంలో అతడు ఏకంగా ఆమె ఎదపై ముద్దులు పెట్టేశాడు. దీంతో ఈ లైవ్ వీడియోను శ్రీయ వెంటనే ఆపేసింది. ఇక, దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఇది వైరల్ అయిపోయింది. వీడియో చూసిన వాళ్లంతా ఆమెపై విమర్శలు చేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here