శ్రీముఖి క్యారెక్టర్ బయటపెట్టిన అవినాష్: ఆత్మహత్య చేసుకునే టైమ్లో అలా.. ఆమె వల్లే అంటూ ఏడుస్తూ!

0
10

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు సందడి చేస్తోన్న సెలెబ్రిటీలను తయారు చేసిన షో జబర్ధస్త్. దీని ద్వారానే ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. దాదాపు ఐదారేళ్లుగా తనదైన శైలి కామెడీతో సందడి చేస్తోన్న అతడు.. బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ షోలో యాంకర్ శ్రీముఖి క్యారెక్టర్‌ను బయట పెట్టాడు అవినాష్. అంతేకాదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని కూడా వెల్లడించాడు.

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా

మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించాడు ముక్కు అవినాష్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ ఆర్టిస్టుల దృష్టిలో పడ్డాడు. తద్వారా ఆ షోలోకి ప్రవేశించి ఎన్నో టీమ్‌లలో ఆర్టిస్టుగా పని చేశాడు. ఇలా చాలా తక్కువ సమయంలోనే ఆకట్టుకున్న అతడు.. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అవినాష్.. జబర్ధస్త్‌లోనే బెస్ట్ కమెడియన్‌గా పేరును సంపాదించాడు.

జబర్ధస్త్‌కు గుడ్‌బై.. అందులోకి ఎంట్రీ

జబర్ధస్త్ షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అవినాష్.. వరుసగా సినిమాలు, షోలలో పాల్గొనే అవకాశం అందుకున్నాడు. కానీ, షోను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. అయితే, గత ఏడాది దానికి గుడ్‌బై చెప్పేశాడు. అదే సమయంలో బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయేలా అందులోకి ప్రవేశించిన అవినాష్.. ఆరంభంలోనే ఎంతగానో గుర్తింపు పొందాడు.

భారీ షాక్.. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు

టైటిల్ ఫేవరెట్‌గా బిగ్ బాస్ షోలోకి వెళ్లిన అవినాష్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే అతడు చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత గొడవల్లో భాగం అవుతూ.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొవడంతో పాటు ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయ్యాడు. షోలో గెలవకున్నా బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా బిరుదును అందుకున్నాడు.

‘కామెడీ స్టార్స్‌’లో రచ్చ చేస్తోన్నాడు

బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. వాటిలో స్టార్ మాలో ప్రారంభమైన ‘కామెడీ స్టార్స్’ అనే షో ఒకటి. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ చేస్తోంది. చమ్మక్ చంద్ర తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అవినాష్‌ ఇందులో తరచూ హైలైట్ అయ్యేలా నవ్విస్తున్నాడు.

శ్రీముఖి క్యారెక్టర్ బయటపెట్టిన స్టార్

వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ‘కామెడీ స్టార్స్’ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ ఎపిసోడ్‌కు శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతూ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ షోలో భాగంగా అవినాష్.. రాములమ్మలా గెటప్ వేసుకుని ఆమెను ఇమిటేట్ చేశాడు. ఇందులో అందరినీ కడుపుబ్బా నవ్వించిన అతడు.. చివర్లో శ్రీముఖి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అనంతరం ఎమోషనల్ అయ్యాడు.

ఆత్మహత్య సమయంలో ఆమె అలా

అవినాష్ మాట్లాడుతూ.. ‘షూటింగులు లేక, అమ్మనాన్నకు ఆపరేషన్ అవడంతో డబ్బులు లేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఆ టైమ్‌లో బిగ్ బాస్ ఆఫర్ రావడం, పది లక్షలు కట్టాల్సి రావడం జరిగాయి. అప్పుడు నేను ఎవరినీ అడగలేకపోయాను. కానీ, శ్రీముఖి విషయం తెలిసి తన డబ్బులు ఇచ్చింది’ అంటూ తెగ ఏడ్చేశాడు. అంతేకాదు, ఆమెకు దండం కూడా పెట్టాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here