శర్వానంద్ పెళ్ళికి ప్రభాస్ అడ్డు.. సీక్రెట్స్ బయటపెట్టిన టాలీవుడ్ నటి!

0
8

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్ పేరు. నలభై ఏళ్ళు పై బడుతున్నా ఆయన ఎందుకో పెళ్లి విషయం మీద శ్రద్ధ చూపించడం లేదు.. అయితే శర్వానంద్ కూడా ఇప్పుడు ప్రభాస్ బాటలోనే నడుస్తున్నాడా? పెళ్లి చేసుకోమని శర్వానంద్ అని అడిగితే ప్రభాస్ పేరు చెబుతున్నారట,

కీలక వివరాలు వెల్లడించిన స్వప్నిక

చాలామంది నటులు తర్వాత మెగాఫోన్ పట్టుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక నటి దర్శకత్వ శాఖలో బిజీ అవ్వాలని చూస్తోంది. నారా రోహిత్ నటించిన సోలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రాజుగారిగది, జంబలకడిపంబ, గీత గోవిందం, రాహు, శశి సినిమాలో కీలక పాత్రలో నటించి అందరిని మెప్పించిన స్వప్నిక ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు..

మహేష్ తో షూటింగ్

మహేష్ బాబుతో వర్కింగ్ ఎలా ఉంది అని ఆమెను ప్రశ్నించగా చాలా కూల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఎప్పుడూ సెట్ లో చాలా జోవియల్గా ఉంటారని ఆయన ఉన్నచోట ఎనర్జీ కచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తాము మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తి చేశామని రెండవ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చారు.

నాగశౌర్య, శర్వానంద్ ఫ్రెండ్స్

ఇక ఇండస్ట్రీలో నాగశౌర్య, శర్వానంద్ ఇలాంటి వారు మంచి స్నేహితులట కదా అని ప్రశ్నించగా ఆ విషయానికి ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనకు నాగశౌర్య, శర్వానంద్ ఇద్దరూ మంచి స్నేహితులు అని నాగశౌర్య తనను అక్క అని పిలుస్తాడు అని చెప్పుకొచ్చారు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తనకు పెళ్లయి ఏడేళ్ల అవుతున్న విషయం ఆయనకు తెలిసినా సరే ఎప్పుడు కనిపించినా నా పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తాడు అని చెప్పుకొచ్చింది.

ప్రభాస్ పెళ్ళయితేనే

తనను మాత్రమే కాక తన భర్త కనిపించినా సరే ఆయనను కూడా పెళ్ళెప్పుడు అని ప్రశ్నిస్తాడు అని అలా ఇద్దరితో సరదాగా కామెంట్ చేసి, జీవితాంతం ఏం కలిసి ఉంటారులే అని కామెంట్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చింది. ఇక శర్వానంద్ పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా దానికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.. ఈ మధ్యకాలంలో శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అని శర్వానంద్ తల్లి అడిగినా సరే ప్రభాస్ అన్న పెళ్లి అయ్యాక తాను పెళ్లి చేసుకుంటానని శర్వానంద్ చెబుతున్నారట.

డైరెక్టర్ గా సినిమా

శర్వానంద్ సంగతి ఏమో తెలియదు గానీ ప్రభాస్ పెళ్లి అయితే చాలా మంది అమ్మాయిలు బాధ పడతారని స్వప్నిక చెప్పుకొచ్చింది.. అయితే బహుశా పెళ్లి ప్రెజర్ నుంచి తప్పించుకోవడానికి శర్వానంద్ అలా మాట్లాడి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. ఇక స్వప్నిక మాట్లాడుతూ తనకు జీవితంలో డైరెక్టర్ గా ఒక్క గుర్తుండిపోయే సినిమా అయినా చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా కోరిక తీర్చుకుంటానని ఆమె వెల్లడించారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here