వైష్ణవ్ లా మరెవ్వరు సాహసం చేసేందుకు సిద్దంగా లేరా?

0
21

టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదల అయ్యి ఘన విజయం సాధించిన సినిమాలు ఏవీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా ఉప్పెన. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకైక వంద కోట్ల సినిమా ఉప్పెన అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టిల లవ్ కమ్ రొమాన్స్ మరియు విజయ్ సేతుపతి విలనిజం దర్శకుడు బుచ్చి బాబు మేకింగ్ అండ్ టేకింగ్ అన్ని కలగలిపి ఉప్పెన సినిమా ను బిగ్గెస్ట్ సక్సెస్ గా మార్చాయి. ఈ సినిమా ను తమిళంలో ఒక యంగ్ హీరోతో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి.

రీమేక్ మరియు డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాన సంస్థ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు వారు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాని ఈ సినిమా లో హీరో పాత్ర ను చేసేందుకు ఏ యంగ్ తమిళ హీరో కూడా ముందుకు రావడం లేదట. ఈ సినిమా లో హీరో క్లైమాక్స్ ట్విస్ట్ అందరికి తెల్సిందే. అందుకే తమిళ హీరోలు ఈ సాహసంను చేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు.

తమిళంలో ఇలాంటి పాత్రలు.. క్లైమాక్స్ లో చంపేయడాలు ఉంటాయి. కాని ఉప్పెన సినిమాలో హీరోకు చేసినట్లుగా కట్టింగ్ లు మాత్రం ఉండవు. కనుక ఇలాంటి ప్రయోగాన్ని చేస్తే అరవ ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో అనే అనుమానంతో తమిళ హీరోలు ఎవరు కూడా ఈ రీమేక్ కు ఆసక్తి చూపడం లేదట. ముందు ముందు అయిన ఈ సినిమా రీమేక్ కు ఎవరైనా ఒప్పుకుంటారా అంటే అనుమానమే అన్నట్లుగా రీమేకర్ రైట్స్ తీసుకున్న మేకర్స్ ఒక అంచనాకు వచ్చారు. అందుకే ఈ సినిమా ను రీమేక్ కాకుండా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ అసాధ్యం. కనుక ఉప్పెన సినిమా ను డబ్బింగ్ చేసి ప్రముఖ ఓటీటీకి అమ్మేయాలనే యోచనలో రైట్స్ దక్కించుకున్న నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హీరోలు ఎవరైనా సాహసం చేసి ఈ సినిమాను రీమేక్ చేస్తే తప్పకుండా కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుంది. కాని ఎవరు కూడా వైష్ణవ్ తేజ్ మాదిరిగా సాహసం చేసేందుకు ముందుకు రావడం లేదు. మొదటి సినిమాకే ఇలాంటి సాహసం చేసేందుకు వైష్ణవ్ ముందుకు రావడం అంటే నిజంగా చాలా పెద్ద విషయం.

మెగా ఫ్యామిలీ అంతా కూడా అందుకు ఒప్పుకున్నారు అంటే బుచ్చి బాబు చెప్పిన కథను వారు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. కాని తమిళ హీరోలు ఎవరు కూడా ఈ సాహస పాత్రకు సిద్దంగా లేరు. కథపై నమ్మకం ఉన్నా కూడా వారు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఒక వేళ డబ్బింగ్ అయ్యి విడుదల  అయిన తర్వాత ఏ హీరో అయినా మనసు మార్చుకుంటాడేమో చూడాలి. ఉప్పెన అరవ వర్షన్ గురించి ఒకటి రెండు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here