వేశ్య పాత్ర అని చెప్పకుండా మోసం చేశారు!

0
18

టాలీవుడ్ లో కింగ్ సరసన `మన్మథుడు 2`లో అతిథిగా మెరిసింది అక్షర గౌడ. తనదైన గ్లామరస్ యాక్ట్ తో మెరిపించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత పలువురు తెలుగు నిర్మాతలు ఆఫర్లు ఇచ్చారని ప్రచారం సాగింది.

ప్రస్తుతం `శూర్పణఖ` అనే తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో అక్షర కీలక పాత్రను పోషిస్తోంది. ఇక అక్షర సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన  ఓ హాట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

నిజానికి కోలీవుడ్ లో హీరోయిన్ గా వెలగాలని కలలుగన్న ఈ టాప్ మోడల్ కం నటికి అప్పట్లో దళపతి విజయ్ నటించిన తుపాకి (తుప్పాకి)లో వేశ్య పాత్రలో అవకాశం లభించింది. అది ఒక సీన్ కి మాత్రమే పరిమితమైనది. అయితే విజయ్- మురుగదాస్ టీమ్ తనకు చెప్పింది వేరు.. చేయించినది వేరు!! అని అక్షర ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వేశ్య పాత్ర అనేది తనకు స్పష్ఠంగా చెప్పలేదని కానీ ఆ తర్వాత నటించాల్సొచ్చిందని తెలిపారు. మురుగాస్ – సంతోష్ శివన్ వంటి ప్రముఖులతో పని చేస్తున్నాననే సంతృప్తితో ఆ చిన్న అవకాశాన్ని కాదనుకోలేకపోయానని తెలిపింది. రెజీన టైటిల్ పాత్ర పోషిస్తున్న శూర్పణఖ లో సేతుపతి హీరో. ఇందులో కీలక భూమిక పోషిస్తున్న అక్షర ఏమేరకు ఆడియెన్ కు కనెక్టవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here