వేళా పాళా లేకుండా `పటాకా` వేషాలేంటమ్మా!

0
16

కరోనా కోరలు సాచే వేళ మాల్దీవుల వెకేషన్ కి వెళ్లిన భామలందరిపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సమయం సందర్భం లేకుండా సెలబ్రిటీలు ఇలా టీజ్ చేయడం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాల్లో వ్యక్తమైంది. సమాజానికి ఈ కష్ట కాలంలో జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి ఇలా సెలబ్రేషన్ కోసం వెళతారా? అంటూ ట్రోల్స్ చేశారు.

ఇక ఇంత జరుగుతున్నా బర్త్ డే వేడుకల పేరుతో రాయ్ లక్ష్మీ చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఓవైపు సెకండ్ వేవ్ కల్లోలంపై దేశం ఆందోళన చెందుతుంటే.. అదేమీ పట్టనట్టు తన పార్టీలు వేడుకల్లో ఫ్రెండ్సుతో కలిసి ఆస్వాధనలో పడింది. దానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ట్రోల్స్ తనలో మార్పు తెచ్చినట్టు లేదు.

తాజాగా పటాకా అంటూ పసుపు రంగు ఫ్రాకులో ప్రత్యక్షమైంది. ఈ డ్రెస్ పై పటాకా అన్న మూడక్షరాలు వేడి పెంచాయి. లక్ష్మీ రాయ్ ఆ డ్రెస్ కి తగ్గట్టే పసుపు వర్ణం కళ్లద్దాలతో కిరాక్ పుట్టించేస్తోంది. ఖైదీనంబర్ 150- సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఐటెమ్ పాటలతో వేడి పుట్టించిన రాయ్ లక్ష్మీ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నా ఏవీ రిలీజ్ కాని పరిస్థితి. ఆ క్రమంలోనే ఇలా ఖాళీ సమయాన్ని ఫోటోషూట్లతో నడిపించేస్తోంది.

నారింజ – పసుపు లంగా ధరించిన `రాయ్ లక్ష్మీ` ఈ చిత్రంలో మిరుమిట్లు గొలిపే అందంతో కనిపిస్తోంది. అదే రంగు సన్ గ్లాసెస్ ఈ చిత్రానికి మరింత అందాన్ని చేకూర్చాయి. హీరోయిన్ తన దుస్తులపై పటాకా! అనే ట్యాగ్ కూడా ఉంది. యు ఉర్ మీ దృష్టిని ఇస్తుంది .. ఆమె చిత్రాన్ని శీర్షిక చేసింది.

బాగా ఈ చిత్రం ఇప్పుడు ఆమె అభిమానులందరికీ మంచి సమ్మర్ మార్నింగ్ వైబ్స్ ఇస్తోంది. కెరీర్ ముందు రాయ్ లక్ష్మి ప్రస్తుతం చాలా కొద్ది తమిళ- తెలుగు- హిందీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here