వెర్సాస్ గృహంలో హాట్ వెర్సాస్ బేబి

0
28

ఈజిప్టు నటుడు మొహమ్మద్ రంజాన్ తో కలిసి తొలి అంతర్జాతీయ మ్యూజిక్ ఆల్బమ్ వెర్సాస్ బేబీ లో ఆడిపాడింది ఊర్వశి రౌతేలా. ఈ పాట చిత్రీకరణ వెర్సాస్ హౌస్ లో జరిగింది. ఈ సందర్భంగా తన మేకప్ రూమ్ వీడియోని ఊర్వశి ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇక ఈ మ్యూజిక్ ఆల్బమ్ సంగతుల్ని కూడా ఊర్వశి తాజా చాటింగ్ లో వెల్లడించింది. ఈ పాటలో తాను చాలా రకాల బాలీవుడ్ అంశాలను జోడించడానికి ప్రయత్నించానని.. భారతీయత అనే అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించానని ఊర్వశి చెప్పారు.

“మీరంతా దీన్ని ఆస్వాధిస్తారు.. భారతీయ నటిగా చాలా బాలీవుడ్ అంశాలను జోడించడానికి ప్రయత్నించాను. నేను ఏ ప్రాజెక్ట్ లో భాగమైనా… దానికి చాలా భారతీయత ఉండాలనుకుంటాను.. మీరు వెర్సాస్ బేబీలో చాలా బాలీవుడ్ మ్యాటర్ ని చూడబోతున్నారు“ అని అన్నారు. “ఇది చాలా ప్రత్యేకమైనది .. నా హృదయానికి చాలా దగ్గరైనది. నా తల్లిదండ్రులు.. కుటుంబం .. స్నేహితులు దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు“ అని తెలిపారు.

భారతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఒక భారతీయ నటి పాపులరవ్వడం చాలా గొప్ప గౌరవం. ఇది వెర్సాస్ బేబీ గా పిలుచుకునే మ్యూజిక్  ఆల్బమ్. అది కూడా ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్ వెర్సాస్ చేత బ్యాకప్ చేసినది. వెర్సాస్ బ్రాండ్ టాప్ టు బాటమ్ ధరించాను. ఆభరణాల నుండి బూట్ల వరకు దుస్తులు.. ఉపకరణాలను ధరించాను. అలాగే వెర్సాస్ గృహంలో షూటింగ్ చేశారు. ఈ ఆల్బమ్ నా అరబ్ అభిమానులతో పాటు అంతర్జాతీయ అభిమానులందరికీ ఈద్ బహుమతి“ అని ఊర్వశి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here