వెనక్కి వెళుతున్న హరిహర వీరమల్లు సినిమా.. అదే డేట్ కి ఫీస్ట్ రెడీ చేసిన పవన్?

0
12

వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ టికెట్ల విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతుండగానే ఓ ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ప్రకటించ లేని పరిస్థితి. తాజా సమాచారం మేరకు పవన్ చేస్తున్న ఒక సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

వకీల్ సాబ్ సూపర్ హిట్ తో

హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ అనే సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. పవన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతి హసన్ ఆయన భార్యగా నటించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు

వరుస సినిమాలు

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ అనే సినిమాలు ఒప్పుకున్నాడు. ఇవి కాకుండా హరీష్ శంకర్ తో ఒక సినిమా బండ్ల గణేష్ తో ఒక సినిమా సురేందర్ రెడ్డితో ఒక సినిమా కూడా ఒప్పుకున్నారు.

వెనక్కి హరిహర వీరమల్లు

నిజానికి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్ల సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు నుంచి భావిస్తూ వచ్చారు. కానీ తాజా సమాచారం మేరకు ఆ సినిమా షూటింగ్ అప్పటికి పూర్తి చేసి రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

సంక్రాంతికే రీమేక్ సినిమా

అయితే సంక్రాంతి సీజన్ కు ఫ్యాన్స్ నిరాశ పరచడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రానాతో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎలాంటిది లేనప్పటికీ సినిమా అయితే కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కథ స్క్రీన్ ప్లే విషయంలో సహాయ పడుతున్నారు.

ఒక రేంజ్ లో

ఇక దర్శకుడు సాగర్ చంద్ర 12వ తేదీ నుంచి మొదలు కాబోతున్న షెడ్యూల్ లో ఒక మంచి ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నారు అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ అని అంటున్నారు. ఇక ఈ సీన్ ను మేకర్స్ ఒక రేంజ్ లో ప్లాన్ చేశారని అంటున్నారు. పవన్ కి ఉన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ సీన్ ఉండనుందని అంటున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here