వెండి తెరపై

0
20

ఒకప్పుడు ఓటీటీ కంటెంట్ అంటే కేవలం బూతు పురాణం అనే అభిప్రాయం ఉండేది. ఒకప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు కూడా అలాగే ఉండేవి. ఈమద్య కాలంలో ఓటీటీలో కాస్త బూతులు తగ్గిస్తున్నారు కాని రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు ఓటీటీలో బూతులు వస్తుంటే మ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. బూతులు మాత్రమే కాకుండా ఓటీటీ కంటెంట్ అంటే శృతి మించిన శృంగారం మరియు హింస కూడా ఉండేది. ఇప్పటికి కొన్ని ఓటీటీలు బూతులు అడల్ట్ సన్నివేశాలతో రన్ అవుతున్నాయి. కాని రెగ్యులర్ టాప్ ఓటీటీలు మాత్రం బూతులను తగ్గించాయి. ఓటీటీల్లో విడుదల అంటే కాస్త బూతులు ఎక్కువే ఉండవచ్చు అనేది టాక్. ఓటీటీ సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ ల్లో చిన్న చిన్న బూతులు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. అలాంటివి మనం థియేటర్లలో చూడటం చాలా చాలా అరుదు.ఒక మోస్తరు హీరోలు స్టార్ హీరోల్ల సినిమాల్లో అలాంటి బూతులు అస్సలు ఉండవు. కాని ఓటీటీ ప్రభావమో లేదా మరేంటో కాని థియేటర్ లో విడుదల అయిన సిటీమార్ లో రెండు మూడు పచ్చి బూతులు ఉన్నాయి. అది కూడా హీరోయిన్ తమన్నా నోటి నుండి వచ్చిన బూతు. ఒక సన్నివేశంలో తమన్నా లం.. కొడక అంటూ తిడుతుంది. ఆ బూతు కావాలని చెప్పించినట్లుగా లేదు.. అలాగే సన్నివేశంకు వ్యతిరేకంగా లేదు. సందర్బానుసారంగానే ఉంది కనుక ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. కాని కొందరు మాత్రం బూతు విషయంలో దర్శకుడు సంపత్ నంది మరియు చెప్పిన తమన్నాను విమర్శిస్తున్నారు.సిటీమార్ లో తమన్నా చెప్పిన ఆ ఒక్క బూతు మాత్రమే కాకుండా పోసానితో కూడా బూతులు చెప్పించాడు. బూతుల విషయానికి వస్తే చాలా మంది కామన్ గా అనుకునే మాటలనే ఇందులో చూపించారు. బూతులు ఓటీటీ కంటెంట్ స్వభావం కనుక ఈ సినిమా కూడా ఓటీటీకి ఇవ్వాలనుకుని ఇలా బూతులు పెట్టారా అంటూ సంపత్ నందిని కొందరు ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమన్నాతో అంత పెద్ద బూతు చెప్పించినా కూడా దర్శకుడు సంపత్ నందికి మంచి సక్సెస్ అయితే దక్కిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కబడ్డీ ఆటను ఇష్టపడేవారితో పాటు అంతా కూడా సిటీమార్ కు ఫిదా అవుతున్నారు అంటూ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here