వృద్ధాప్యం మరియు మరణాన్ని నిరోధించే ఆర్జీవీ ‘టాబ్లెట్’

0
15

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించిన వర్మ.. ప్రస్తుతం ఫిక్షనల్ రియాలిటీ సినిమాలు – యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ లోనూ సినిమాలు తీసి పాకెట్ నింపుకున్న ఆర్జీవీ.. ప్రస్తుతం పది సినిమాలను రిలీజ్ కి రెడీ చేశారు. సాగర్ మాచనూరు కొత్తగా స్థాపిస్తున్న ‘స్పార్క్’ ఓటీటీలో ‘ఆర్జీవీ వరల్డ్’ లో ఈ సినిమాలన్నీ విడుదల కానున్నాయి. అందులో రిలీజ్ కానున్న సినిమాలలో ”టాబ్లెట్” ఒకటి. ‘అది మరణాన్ని ఆపుతుంది కానీ నిన్ను చంపుతుంది’ అనేది దీనికి ట్యాగ్ లైన్.

మే 15న ‘స్పార్క్’ ఓటీటీ లాంచ్ అవుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తాజాగా ”టాబ్లెట్” ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఒక చేతిలో టాబ్లెట్(మాత్ర) ఉండగా.. దాని కోసం క్రింద నుంచి అనేకమంది చేయి చేస్తున్నట్లు ఈ పోస్టర్ లో చూపించారు. మనుషులకు వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కనుగొనబడిన మెడిసిన్ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘టాబ్లెట్’ చిత్రానికి కమల్ ఆర్ దర్శకత్వం వహించారు. ‘స్పార్క్’ సాగర్ మాచనూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. ”ప్రతి ఒక్కరూ వృద్ధాప్యం మరియు మరణానికి భయపడుతుంటారు. వృద్ధాప్యం మరియు మరణాన్ని నిలిపివేసే ఒక కొత్త మెడిసిన్ గురించి ఈ సినిమాలో చెప్పబడుతుంది. మానవాళికి అతిపెద్ద బూన్ గా కనిపించేది.. అతి పెద్ద శాపం అని త్వరలో గ్రహించబడుతుంది. ఈ చిత్రం త్వరలో ‘స్పార్క్’ ఓటీటీలో రిలీజ్ అవుతుంది” అని పేర్కొన్నారు.

ఇకపోతే రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘D కంపెనీ’ ‘ఆర్జీవీ మిస్సింగ్’ ‘డేంజరస్’ ‘దిశ ఎంకౌంటర్’ ‘జగన్ మొండి’ ‘లడికీ’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినాకైఫ్’ ‘గాడ్సే’ ‘ది డెడ్ ఆర్ అలైవ్’ వంటి సినిమాలు ‘స్పార్క్’ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here