వివాదాస్పద నటికి కరోనా పాజిటివ్

0
33

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అయితే.. తాను దాన్ని ఎదుర్కొంటానని చెప్పారు.

‘కొన్ని రోజులుగా కళ్లు మండుతున్నాయి. అలసటతోపాటు నీరసంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాలని కొవిడ్ టెస్టు చేయించుకున్నాను. అయితే.. శనివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది” అని రాసుకొచ్చింది కంగనా. అయితే.. తాను వైరస్ ను నాశనం చేస్తానని చెప్పారు.

”ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. నా శరీరంలో కరోనా వైరస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటాయని నేను అనుకోవట్లేదు. వాటిని నాశనం చేస్తాను. మీరు భయపడితే.. కరోనా మరింత భయపెడుతుంది. రండి మనం దాన్ని నాశనం చేద్దాం. కొవిడ్-19 అంటే భయపడేంత ఏమీ లేదు. చిన్నపాటి ఫ్లూ మత్రమే. ప్రజలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తోంది” అని పోస్టు చేశారు.

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా.. ఇటీవల పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీపై అభ్యంతరకర కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్.. కంగానా ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా.. మార్పు రాకపోవడంతో ఆమె అకౌంట్ ను శాశ్వతంగా రద్దు చేసింది. దీంతో.. ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు కంగనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here